డేటింగ్.. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఈ పదం బాగా వినిపిస్తోంది. హీరోయిన్ అందంగా ఉంటే చాలు.. ఆమెతో డేటింగ్ చేయాలని చాలామందికి ఆశ పుడుతుంది. ఈ క్రమంలో జరిగే పరిణామాలే క్యాస్టింగ్ కౌచ్ కి దారి తీస్తాయి. ఇలాంటి డేటింగ్ పై తాజాగా ముగ్గురు హీరోయిన్లు వేరు వేరు సందర్భాల్లో కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. పైగా ఈ ముగ్గురు సక్సెస్ ఫుల్ హీరోయిన్లు కూడా. ఇంతకీ వాళ్లు ఎవరు?, వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం రండి.
ముందుగా బాలీవుడ్ ఐటమ్ నటి నోరా ఫతేహి తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది. ”కెరీర్ ప్రారంభంలో నన్ను కూడా పదేపదే కాంప్రమైజ్ అవ్వమని చెప్పారు. కొందరు వ్యక్తులతో డేటింగ్ చేయమని బలవంతం చేసేవారు. నన్ను కొందరు ఎంతో ఇబ్బంది పెట్టారు. వారి సరదాలు చాలా దారుణంగా ఉంటాయి. ఆ తర్వాత అలాంటి వ్యక్తులకు దూరం జరిగాను. ఆరోజు నుంచి వేటికి తలొగ్గకుండా ముందుకు వెళ్లాను.. విజయవంతం అయ్యాను” అని నోరా ఫతేహి చెప్పుకొచ్చింది.
Also Read:KTR:ఎంఎల్‌పీలతో ట్రాఫిక్ సమస్యకు చెక్
ఇక మరో హీరోయిన్ విషయానికి వస్తే.. తనతో డేటింగ్ చేయాలని ఓ హీరో కాళ్లావేళ్లా పడ్డాడని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తెలిపింది.‘‘ఆ హీరో నా డేటా మొత్తం హ్యాక్ చేశాడు. దాంతో నేను ఎక్కడికెళ్తే అక్కడికి వచ్చేవాడు. ఆ హీరోకు నేనంటే పిచ్చి. డేటింగ్ చేద్దామని నా కాళ్లావేళ్లా పడ్డాడు. కానీ నేను నో చెప్పాను. దాంతో నన్ను వేధించడం మొదలు పెట్టాడు’’ అంటూ రణ్‌బీర్ కపూర్ పేరు ప్రస్తావించకుండా కంగనా ఇన్‌స్టాలో స్టోరీ రాసుకొచ్చింది.
అలాగే ‘సామజవరగమన’ మూవీ హీరోయిన్ రెబా మోనికా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. తెలుగులోకి రాకముందు మిమ్మల్ని ఒక స్టార్ హీరో డేట్‌కు పిలిచారట కదా..? అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి రెబా మోనిక బదులిచ్చింది. ”అవును.. డేట్‌కు పిలిచారు.. కానీ నేను వెళ్లలేదు. అయినా డేట్‌కు వెళ్లడమనేది తప్పుగా భావించాల్సిన విషయం కాదు” అని ఆమె చెప్పుకొచ్చింది.
Also Read:రాజమౌళి – మహేష్..మల్టీస్టారర్ మూవీనా!