సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. అలాంటి రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్ లో రజనీకాంత్ మాట్లాడుతూ.. తన సినీ కెరీర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ, రజనీకాంత్ ఏం మాట్లాడారు అంటే.. తన కెరీర్ ఎదుగుదలలో దర్శకుల పాత్ర ఎంతో ఉందని, వాళ్ల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. తాము సృష్టించిన కథల్లో తనను హీరోగా పెట్టి, సినిమాలు చేసి తనకు గుర్తింపు అందించారని సూపర్ స్టార్ వివరించారు.
ఇక రజనీకాంత్ ఆస్తుల పై కూడా ఓ వార్త వైరల్ అవుతుంది. తన మరణం తర్వాత ఆస్తి మొత్తం తనను సూపర్ స్టార్‌ను చేసిన జనాలకు, తన సినిమాలు చూసేందుకు డబ్బులు కేటాయించిన పేద ప్రజలకు చెందాలని రజనీకాంత్ గతంలోనే ప్రకటించాడు. ప్రస్తుతం ఈ వార్త మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది., రజనీకాంత్ తాజా చిత్రం ‘జైలర్’ ఆగస్టు 10న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే రజనీ కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతున్నాడు.
Also Read:వర్షాకాలంలో ఫుడ్ పాయిజన్ కు చిట్కాలు!
ఈ క్రమంలోనే SRH ఓనర్ కావ్యా మారన్ పడే బాధను తాను చూడలేకపోతున్నానని సూపర్‌స్టార్ రజినీకాంత్ కామెంట్స్ చేశాడు. కావ్య తండ్రి కళానిధి నిర్మించిన జైలర్ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంలో రజనీ మాట్లాడుతూ.. ‘మ్యాచ్ ఓడినప్పుడు స్టేడియంలో కావ్య నిరాశగా ఉండటాన్ని చూడలేక చాలాసార్లు ఛానల్ మార్చా’ అని పేర్కొన్నారు. జట్టులో మంచి ప్లేయర్లను పెట్టుకోవాలని, మ్యాచ్‌ను గెలవాలనే కసి ఉన్న క్రికెటర్లకు చోటివ్వాలని కావ్యకు సూపర్ స్టార్ ఆమెకు సూచించారు. ఈ కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
Also Read:టీటీడీ ట్రస్టులకు రూ.30 లక్షలు విరాళం