Rana:’కాంత’

32
- Advertisement -

టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా, తెలుగులో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించిన మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఓ చిత్రం కోసం జతకట్టారు. రానా స్పిరిట్ మీడియా, దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ మల్టీ లింగ్వల్ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించనున్నారు.

దుల్కర్ సల్మాన్ పుట్టినరోజున మేకర్స్ ఆసక్తికరమైన పోస్టర్‌తో సినిమా టైటిల్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘కాంత’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు. సహ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించనున్నారు.

Also Read:పవన్ ఆశలపై బీజేపీ నీళ్ళు చల్లుతోందా?

ఈ సినిమాతో అసోసియేట్ అవ్వడానికి చాలా ఎక్సయిటెడ్ గా వున్న రానా ఇది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని భరోసా ఇచ్చారు.ఈ చిత్రం గురించి రానా మాట్లాడుతూ.. “చాలా అరుదుగా మంచి సినిమా పవర్ గుర్తు చేసే కథ మనకు కనిపిస్తుంది. కాంత మమ్మల్ని ఒకచోట చేర్చిన ప్రాజెక్ట్. సూపర్ ట్యాలెంటెడ్ దుల్కర్ సల్మాన్, వేఫేరర్ ఫిలిమ్స్ తో ఈ ప్రయాణాన్ని ప్రారంభించడం పట్ల మేము ఆనందిస్తున్నాము. అతని పుట్టినరోజు సందర్భంగా రాబోయే సరికొత్త ప్రపంచానికి సంబధించిన టైటిల్ రివిల్ చేశాం. పుట్టినరోజు శుభాకాంక్షలు దుల్కర్ సల్మాన్. కాంత ప్రపంచానికి స్వాగతం అన్నారు.

Also Read:వర్షాకాలంలో ఫుడ్ పాయిజన్ కు చిట్కాలు!

- Advertisement -