గత కొన్నాళ్లుగా మణిపుర్ లో ఎంతటి హింసాకాండ కొనసాగుతోందో అందరికీ తెలిసిందే. కులాల మద్య ఏర్పడిన చిత్తు పెరిగి పెద్దదై విపత్తులా మారింది. ఆ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న మిటీ, కుకీ, నాగా వంటి మూడు ప్రధాన తెగల మద్య ఏర్పడిన కుల చిత్తు ఆరని అగ్నిమంటలా కొనసాగుతోంది. కుల హోదాకోసం సాగుతున్న విపత్తులో ఎప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక తాజాగా ఓ వర్గానికి చెందిన వారు మరో వర్గానికి చెందిన మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానుష ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆ వీడియో విపరీతంగా వైరల్ కావడంతో మణిపుర్ ఘటన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. .
మహిళలపై అమానుషంగా ప్రవర్తించిన వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని, ఇది భారతీయులకే కలంకం తెచ్చే మచ్చ అంటూ ప్రధాని నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. ఇదిలా ఉంచితే మోడి సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్నాళ్లుగా మణిపుర్ లో ఈ స్థాయి అల్లర్లు, హింసాకాండ చెలరేగుతుంటే కేంద్రం ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని మోడి సర్కార్ ను ప్రశ్నిస్తున్నారు కొందరు. మణిపుర్ అల్లర్ల వెనుక మతతత్వ వాదం, కులవాదం ప్రధాన కారణాలని తెలిసినప్పటికి అల్లర్లను సద్దుమనిగింపజేసె దిశగా కేంద్రం ఎందుకు ప్రయత్నించడం లేదు. ఈ అల్లర్ల వెనుక బిజెపి హస్తం కూడా ఉందా అనే ప్రశ్నను కొందరు రాజకీయ వాదులు లేవనెత్తుతున్నారు.
Also Read:మైనార్టీల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం:హరీష్
మహిళలపై తాజాగా జరిగిన అమానుష ఘటనకు సంబంధించి కేంద్ర తీరుపై సుప్రీం కోర్టు ఫైర్ అయింది. మణిపూర్ లో ఇంత జరుగుతున్నా కేంద్రం మరియు మణిపూర్ ప్రభుత్వం ఏం చేస్తున్నాయని ప్రశ్నించింది. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం పై చర్యలు తప్పవని సుప్రీం కోర్టు హెచ్చరించింది. ఇదిలా ఉంచితే ప్రస్తుతం మణిపూర్ లో జరుగుతున్నా హింసకాండ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీపై గట్టిగా ప్రభావం చూపే అవకాశం ఉంది. మణిపూర్ విషయంలో బీజేపీ ప్రభుత్వ అసమర్థత బయటపడుతోందనే భావన దేశప్రజల్లో కలిగే అవకాశం ఉంది. మరి మణిపూర్ విషయంలో ఇప్పటికైనా కేంద్రం సరైన రీతిలో చర్యలు తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో దేశ ప్రజలు బీజేపీని గద్దె దించడం ఖాయమే అని కొందరి విశ్లేషకుల అభిప్రాయం.
Also Read:పిక్ టాక్ : పులిలా విరజిమ్ముతున్న రాశి