టీ గురించి అందరికీ తెలిసిందే. ఉదయం నిద్ర లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు కనీసం మూడు నుంచి నాలుగు సార్లు అయిన టీ లేదా కాఫీ తాగనిదే రోజు గడవదు. టీ లో కూడా చాలానే రకాలు ఉన్నాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మసాలా టీ, అల్లం టీ, లేమేన్ టీ, గ్రీన్ టీ.. ఇలా చాలానే రకాలు ఉన్నాయి. ఎవరి ఇష్టం మేరకు వాళ్ళు ఆ టీ తాగుతుంటారు. అయితే యాపిల్ టీ కూడా ఉందనే సంగతి చాలమందికి తెలియదు. విదేశాల్లో యాపిల్ టీ ని విపరీతంగా తాగేస్తుంటారు. .
యాపిల్ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల అన్నీ ఇన్ని కావు. అందుకే ప్రతిరోజూ కనీసం ఒక్క యాపిల్ పండు అయిన తినాలని నిపుణులు చెబుతుంటారు. ఆ విధంగా యాపిల్ టీలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు దాగి ఉన్నాయి.యాపిల్ టీ ప్రతిరోజూ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందట. అలాగే వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో కూడా యాపిల్ టీ ఎంతగానో ఉపయోగ పడుతుందట. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి సమస్యలను నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుందట. ఇక ఉదర సంబంధిత సమస్యలకు కూడా యాపిల్ టీ ఒక దివ్యఔషధంలా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ వంటి సమస్యలు కూడా దారి చేరవట.
యాపిల్ టీ తయారు చేయు విధానం
పాత్రలో సరిపడా నీటిని తీసుకొని బాగా మరిగించాలి. ఆ తరువాత శుభ్రంగా కడిగిన యాపిల్ ను ముక్కలుగా చేసుకొని ఆ నీటిలో ఉడికించాలి. ఆ తరువాత తగినంత టీ పొడి, లవంగా, దాల్చిన చెక్క.పొడి, వేసి కాసేపు మరిగించాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని వడగట్టుకొని, కొద్దిగా తేనె కలుపుకొని సేవించాలి. అంతే ఆరోగ్యకరమైన యాపిల్ టీ ఎంతో సులభంగా తయారు కావడంతో పాటు చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
Also Read:తమిళ్ తంత్రం.. బీజేపీ ఏం చేయబోతుంది?