పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్.. ‘ఓజీ’

40
- Advertisement -

ఓ వైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు పవన్. ఇక ప్రస్తుతం పవన్ నటించిన బ్రో విడుదలకు సిద్ధంగా ఉంది. సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించగా సాయిధరమ్ తేజ్ కీలకపాత్ర పోషించారు. జూలై 28న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంత చేశారు.

ఇక తర్వాత పవన్ నటించే సినిమా ఓజీ. సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా భారీ యాక్షన్ తో కూడిన గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ ఈ సినిమా. పవన్ కి జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుండగా డీవీవీ దానయ్య భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

Also Read:చంద్రయాన్-3 విజయవంతం..నెక్స్ట్ టాస్క్ అదే!

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ లుక్స్ పవన్ కెరీర్ బెస్ట్ గా నిలిచే అవకాశంగా ఉందట. అందరిని ఆకట్టుకునేలా సినిమాను సుజిత్ తెరకెక్కిస్తుండగా డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర చేస్తున్నారు.

Also Read:ఓ మై గాడ్ 2పై ఆదిపురుష్ ఎఫెక్ట్!

- Advertisement -