విషాదం : ఆ నటి, ఆ యాంకర్ మృతి

50
- Advertisement -

సినీ లోకంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రముఖ హాలీవుడ్ నటి ఆండ్రియా లిన్ ఎవాన్స్ క్యాన్సర్‌తో మరణించారు. ఆమె నటిగానే కాకుండా నిర్మాతగా కూడా అనేక సినిమాలను నిర్మించారు. పైగా ఆండ్రియా ఎవాన్స్, రెండుసార్లు డేటైమ్ ఎమ్మీ అవార్డుకు కూడా ఆమె నామినేట్ చేయబడ్డారు. అలాగే నటిగా కూడా ఆండ్రియా లిన్ ఎవాన్స్ కి మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఆమె టైమింగ్ చాలా బాగుంటుంది. ఆ టైమింగే ఆమెకు ఎందర్నో అభిమానులను చేసింది. ఆమె మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే, భారతీయ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. దేశంలో జరిగిన పలు ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్రముఖ లైవ్ హోస్ట్ యాంకర్ శివాని సేన్ మృతి చెందారు. ‘ఎపిలెప్టిక్ అటాక్’ అనే బ్రెయిన్ సంబంధిత అనారోగ్య సమస్య కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమానికి కూడా శివాని సేన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.

Also Read:భారీ వర్షాలు..తెలంగాణ భవన్‌ని సంప్రదించండి

సినిమా ఇండస్ట్రీలో అలాగే బుల్లితెర పై గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న హాలీవుడ్ నటి ఆండ్రియా లిన్ ఎవాన్స్, మరియు యాంకర్ శివాని సేన్ మృతి నిజంగా బాధాకరమైన విషయం. మా ‘ గ్రేట్ తెలంగాణ.కామ్ తరఫున ఆండ్రియా లిన్ ఎవాన్స్ మరియు శివాని సేన్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

- Advertisement -