- Advertisement -
కెనడా ఓపెన్ టైటిల్ని గెలుచుకున్నాడు భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్.ఫైనల్ మ్యాచ్లో చైనాకు చెందిన లిషి ఫెంగ్పైతో తలపడిన లక్ష్య సేన్ 21-18, 22-20 తేడాతో విజయం సాధించాడు. తద్వారా ఈ సంవత్సరంలో తన మొదటి డబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిట్ ను గెలుచుకున్నాడు.
కొన్నిసార్లు కష్టతరమైన పోరాటాలు మధురమైన విజయాలకు దారితీస్తాయి. నిరీక్షణ ముగిసింది. కెనడా ఓపెన్ విజేతను అయినందుకు నేను సంతోషిస్తున్నాను అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు లక్ష్యసేన్.
Also Read:ఈ వారం చిత్రాల పరిస్థితేంటి ?
కెనడా ఓపెన్ మహిళ విభాగంలో సెమీస్లో సింధూ ఓటమితో వెనుదిరగగా.. లక్ష్య సేన్ ఫైనల్ మ్యాచ్లో సత్తాచాటి టైటిల్ కైవసం చేసుకున్నాడు.
- Advertisement -