ఈ వారం చిత్రాల పరిస్థితేంటి ?

31
- Advertisement -

జూలై రెండో వారంలో కూడా థియేటర్‌ ల్లో కొన్ని చిత్రాలు సందడి చేయబోతున్నాయి. అలాగే మరోవైపు ఓటీటీల జోరు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ క్రమంలో ప్రతి వారం లాగే ఈ వారం స్ట్రీమింగ్‌ కానున్న కంటెంట్ పై ఓ లుక్ వేద్దాం రండి

ఈ వారం థియేటర్స్ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!

‘బేబి’ :

సాయి రాజేష్‌ దర్శకత్వంలో ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘బేబి’. ఎస్‌కేఎన్‌ నిర్మాత. ఈ సినిమా ఈ నెల 14న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది.

‘మామన్నన్‌’ :

ఉదయనిధి స్టాలిన్‌, వడివేలు, ఫహద్‌ ఫాజిల్‌, కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రల్లో మారి సెల్వరాజ్‌ తెరకెక్కించిన చిత్రం ‘మామన్నన్‌’. ఈ నెల 14న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది.

‘మహావీరుడు’ :

శివ కార్తికేయన్‌ హీరోగా మడోన్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ చిత్రం ‘మహావీరుడు’. ఈ సినిమా జులై 14న థియేటర్స్ లో విడుదల కానుంది.

ఈ వారం ఓటీటీ కంటెంట్ విషయానికి వస్తే :

నెట్‌ ఫ్లిక్స్‌ లో ప్రసారాలు ఇవే :

బర్డ్‌ బాక్స్‌ బార్సిలోనా (హాలీవుడ్‌) జులై 14 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

కొహరా (హిందీ) జులై 15 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ లో ప్రసారాలు ఇవే :

ట్రాన్స్‌ఫార్మర్స్‌: రైజ్‌ఆఫ్‌ ది బీస్ట్స్‌ (హాలీవుడ్‌) జులై 11 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జీ5 లో ప్రసారాలు ఇవే :

మాయాబజార్‌ ఫర్‌ సేల్‌ (తెలుగు) జులై 14 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సోనీలివ్‌ లో ప్రసారాలు ఇవే :

క్రైమ్‌ పెట్రోల్‌ -48 అవర్స్‌ (హిందీ) జులై 10 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

కాలేజ్‌ రొమాన్స్‌ (హిందీ) జులై 15 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ లో ప్రసారాలు ఇవే :

జానకి జానీ (మలయాళం) జులై 11వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ది ట్రయల్‌ (హిందీ) జులై 14వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

- Advertisement -