బఫూన్ ఆఫ్ బాలివుడ్ గా కొందరి చేత పిలవబడే కమాల్ ఆర్ ఖాన్ ఆమధ్య సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మీద పిచ్చి కామెంట్స్ చేశాడు. అసలు ఇలాంటి జోకర్, కార్టూన్ లాంటి హీరో కంటే రాజ్ పాల్ యాదవ్ (బాలీవుడ్ కమెడియన్) సినిమాలు చూడటానికి ఇష్టపడతానని పవన్ అభిమానుల ఆగ్రహానికి గురైయ్యాడు. తాజాగా మరోసారి తన ట్వీటుదూల మరోసారి చూపించాడు. దేశవ్యాప్తంగా బాహుబలి 2 పై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే.. దేశద్రోహి అనే అట్టర్ ఫ్లాప్ సినిమా తీసిన జోకర్ కమల్ ఆర్ ఖాన్ మాత్రం ఘోరమైన విమర్శలు చేశాడు. ట్విట్టర్ వేదికగా ‘బాహుబలి-2’ను రివ్యూ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు కేఆర్కే.
‘ఈ సినిమాలో ప్రభాస్ ఒంటెలా ఉన్నాడు. అతనితో బాలీవుడ్ దర్శకులెవరైనా సినిమా తీయలనుకుంటే వారు నిజంగా ఇడియట్సే. ‘బాహుబలి-2’లో అసలు కథే లేదు. రాజమౌళి దర్శకత్వం అస్సలు బాగోలేదు. సంగీతం గురించి మాట్లాడనక్కర్లేదు. గ్రాఫిక్స్ అయితే మరీ ఘోరం. ఈ సినిమా చూడడం శుద్ధ దండగ. అనవసరంగా మీ డబ్బులు, సమయాన్ని వృథా చేసుకోకండి’ అని ప్రేక్షకులకు సూచించాడు. అలాగే మూడు గంటలపాటు తీయాల్సిన మెటీరియల్ ఇందులో లేదని, చిన్నపిల్లలు ఆడుకునే వీడియోగేమ్లా ఈ సినిమా ఉందని వ్యాఖ్యానించాడు.
ఈ సంచలన వ్యాఖ్యలు చేసిన కమల్ పేరును ప్రస్తావించకుండా దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ట్వీట్లు సంధించారు. “బాహుబలి-2 చిత్రం నచ్చని వారిని చూసి జాలి పడుతున్నా. అతను లేదా ఆమెకు మానసిక చికిత్స అవసరం. చిత్ర నిర్మాత శోబు యార్లగడ్డ ఔదార్యం చూపి వైద్య చికిత్సకు అయ్యే ఖర్చును భరించాలని నా మనవి” అని ట్వీట్ పెట్టాడు. తనకు కూడా బాహుబలి-2 ‘జలసైటిస్’ జబ్బు పట్టుకుందని, ఆసుపత్రిలో చేరానని, మరెంతో మంది చిత్ర నిర్మాతలు సైతం చికిత్స పొందుతున్నారని పరోక్షంగా తెలిపాడు.