తమిళనాడులో గవర్నర్ వర్సెస్ సీఎం హోరాహోరీ పోరు నడుస్తోంది. తాజాగా గవర్నర్ వి సెంథిల్ బాలాజీని మంత్రిగా తొలగించే ఆసాధారణ హక్కులను వినియోగించుకున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. గవర్నర్ ఆర్ఎన్ రవి తీసుకున్న ఉత్తర్వులపై వెనక్కి తగ్గినట్టు జాతీయ మీడియా సమాచారం. అయితే దీన్ని అటార్నీ జనరల్‌తో సంప్రదింపుల కోసమంటూ గవర్నర్ తాత్కాలికంగా నిలుపుదల చేశారు.
అన్నాడీఎంకే హయాంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నగదు తీసుకుని మోసం చేసిన కేసులో ఇటీవల ఈడీ అధికారులు సోదాలు చేసి ఆయన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పలు నేరాలతో సంబంధం ఉన్నట్టు కోర్టు భావించి ఆయన్ని జ్యుడిషయల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఎటువంటి శాఖ లేని మంత్రి సెంథిల్ బాలాజీని మంత్రి మండలి నుంచి తొలగిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గవర్నర్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇదే విషయాన్ని సీఎం స్టాలిన్ తమిళనాడు గవర్నర్ కార్యాలయం నుంచి తెలియజేశారు.
గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యవహారంపై సీఎం స్టాలిన్ కీలక సమావేశం నిర్వహించారు. ఉదయం 10.30నిమిషాలకు సీనియర్ నాయకులు, న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. అయితే పార్టీ కార్యాలయ ఆవరణలో గవర్నర్‌కు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఫ్లేక్సీలు వెలిశాయి. కేబినెట్‌లో కొనసాగుతున్న కేంద్రమంత్రులపై కేసులు ఉన్నాయని వారిని కూడా ఇలాగే తొలగించారా అని డీఎంకే కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Also Read: సాయిచంద్ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్..
ఈ సందర్భంగా డీఎంకే సీనియర్ పార్టీ నేత టీకేఎస్ ఇలంగోవన్ మాట్లాడుతూ.. సీఎంకు తెలియకుండా ఏ మంత్రిని అయినా తొలగించే అధికారం గవర్నర్‌కు లేదని అన్నారు. ఈ గవర్నర్ ఏనాడు కూడా రాజ్యాంగాన్ని గౌరవించలేదని మండిపడ్డారు. గవర్నర్ నిరంతరం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. కేవలం నేరం మోపినంత మాత్రాన మంత్రి పదవికి అనర్హుడు కాలేడని స్పష్టంచేశారు. నేరం రుజువైన పక్షంలోనే అనర్హుడిగా ప్రకటిస్తారని టీకేఎస్ ఇలంగోవన్ అన్నారు.
Also Read: లిమ్కా బుక్‌లో గ్రీన్ ఛాలెంజ్…