సి‌ఎం పదవిపై పవన్ కన్ఫ్యూజన్ ?

43
- Advertisement -

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. ఒకసారి పొత్తు గ్యారెంటీ అనే చెప్పే పవన్.. మరోసారి ఒంటరిగానే బరిలోకి అంటూ వ్యాఖ్యానిస్తారు.. ఒకసారి పదవులపై తనకు మోజు లేదని చెప్పిన పవన్.. మరోసారి తనకు సి‌ఎం పదవి కట్టబెట్టండి అని చెప్పుకొస్తారు. దీంతో పవన్ ఎప్పుడు ఎలా మాట్లాడుతారో అర్థం కాక ఏపీ ప్రజలు, విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో పదవులపై ఎప్పుడు అచీ తూచి మాట్లాడే ఆయన.. ఈ తన ప్రసంగాల్లో తరచూ సి‌ఎం పదవి ప్రస్తావన తీసుకొస్తున్నారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వండి అని సి‌ఎంగా తానెంటో నిరూపిస్తానంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో పవన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే జనసేన ఒంటరిగా వెళ్ళిన.. టీడీపీతో కలిసి వెళ్ళిన సి‌ఎం అభ్యర్థి పవనే నేమో అనే భావన కలుగుతోంది.

Also Read: కాంగ్రెస్.. అదే స్ట్రాటజీ రిపీట్ !

ఇంతలోనే తాజాగా భీమవరంలో జరిగిన జనసేన కార్యకర్తలతో జరిగిన సమావేశంలో సి‌ఎం పదవిపై ఇంకోలా స్పందించారు. ” సి‌ఎం అవ్వడం అన్నిటికి మంత్రదండం కాదని, తాను సి‌ఎం అవ్వాలనుకున్నప్పటికి అధికారులో లేదా నాయకులో అడ్డుపడతారని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే సి‌ఎం పదవిపై పవన్ మళ్ళీ మనసు మార్చుకున్నారా ? అనే అనుమానం రాక మానదు. జనసేన టీడీపీతో కలిసి వెళితే సి‌ఎం అభ్యర్థిగా చంద్రబాబును ఒప్పుకోక తప్పదు. ఒకవేళ జనసేన ఒంటరిగా వెళితే వైసీపీని ఢీ కొట్టి నిలిచే అవకాశాలు తక్కువే. అందుకే సి‌ఎం కావాలనే ఆశ పవన్ లో మెండుగా ఉన్నప్పటికి.. ఎటు తేల్చుకోలేని కన్ఫ్యూజన్ లో పవన్ ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అని విషయాల్లోనూ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నా పవన్.. సి‌ఎం అభ్యర్థి విషయంలో చివరకు ఎలాంటి నిర్ణయానికి వస్తారో చూడాలి.

Also Read: అగ్నిపథ్‌లో మద్దాలి డాటర్ …నెటిజన్లు ప్రశంసలు

- Advertisement -