మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఐదు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన పీఎం మోదీ…అనంతరం ఏర్పాటు చేసిన మేరే బూత్ సబ్సే మజ్బూత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలతో మాట్లాడుతూ…ఈ దేశంలో రెండు చట్టాలు ఎలా నడుస్తాయని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని గుర్తు చేశారు.
గడిచిన 9యేళ్ల కాలంలో సాధించిన విజయాలను కార్యకర్తలకు వివరించారు. ట్రిపుల్ తలాక్‌ను ఈజిప్టు, ఇండోనేషియా, ఖతార్, జోర్డాన్, సిరియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ లాంటి ముస్లిం దేశాల్లో తలాక్ ఆచారాన్ని రద్దుచేసినట్టు గుర్తుచేశారు. ఇది కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ట్రిపుల్ తలాక్‌ను కొనసాగించారని ప్రధాని దుయ్యబట్టారు. తలాక్ రద్దు చట్టంతో ముస్లిం స్త్రీలకు స్వేచ్ఛ కల్పించనట్టు పేర్కొన్నారు. అలాగే రాజకీయ పార్టీలు ముస్లింలను రెచ్చగొడుతున్నారని ప్రధాని ఆరోపించారు. అలాంటి పార్టీలను దూరంగా ఉంచాలని అన్నారు.
Also Read: MODI:ఐదు వందేభారత్ రైళ్లకు పచ్చజెండా
యూనిఫామ్ సివిల్ కోడ్‌ను ఉద్దేశిస్తూ..దేశంలో ప్రజలందరికీ ఒకే చట్టం అవసరాన్ని రాజ్యాంగం కూడా తెలిపిందని ప్రధాని తెలిపారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరాన్ని సుప్రీంకోర్టు కూడా గుర్తించింది. లా కమిషన్ కూడా ఇటీవల ఈ చట్టంపై పనిచేస్తోందన్నారు. దేశంలో పలు మత సంస్థలను, ప్రముఖ వ్యక్తులను ఇప్పటికే ఉమ్మడి పౌరస్మృతిపై సూచనలను కోరినట్టు తెలిపారు.
Also Read: KTR:కాకతీయ పార్క్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్