వయ్యారి భామ పాట లుక్‌ లో పవన్

21
- Advertisement -

పవన్ క‌ళ్యాణ్, సాయి ధ‌ర‌మ్ తేజ్ జంట‌గా స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా బ్రో. వినోదాయ సిత్తం రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే త్వ‌ర‌లోనే బ్రో టీజ‌ర్ రానుంద‌ని ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేస్తూ మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ప‌వ‌న్, సాయి తేజ్ ఇద్ద‌రూ ఊర మాస్ లుక్‌లో క‌నిపిస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తున్నారు. ముఖ్యంగా తమ్ముడు సినిమాలోని వయ్యారి భామ పాట లుక్‌లో పవన్ పోజు దీనిలో అదిరిపోయింది.

మరోవైపు సాయి ధరమ్ కూడా ఈ పోస్టర్‌‌ను ట్వీట్ చేశారు. త్వరలోనే టీజర్‌‌ విడుదల కానుందని చెప్పారు. మొత్తానికి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ మరియు బోల్డ్ బ్యూటీ కేతిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ హాస్య నటుడు అలీ కూడా ఓ చిన్న పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నటుడు, ‘శంభో శివ శంభో’ సినిమా డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

Also Read:Tomato:సెంచరీ కొట్టిన టమోట..

ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ మెయిన్ లీడ్ లో నటిస్తుండగా పవన్ కళ్యాణ్ ఓ గెస్ట్ అపీరెన్స్ లో కనపడనున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ లో భాగం అయ్యినట్టు కన్ఫర్మ్ అయ్యింది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తోందో చూడాలి.

- Advertisement -