విజయనిర్మల వర్ధంతి..

84
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటి, దర్శకురాలు విజయనిర్మల. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా విజయ గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించిన విజయ నిర్మల..2019 జూన్ 27న మృతి చెందారు. ఇవాళ ఆమె వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం..

తమిళనాడులో 1946 ఫిబ్రవరి 20వ తేదీన విజయనిర్మల జన్మించారు. విజయ నిర్మల నటుడు సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి. ఏడేళ్ల వయస్సులో బాలనటిగా తమిళచిత్రం మత్స్యరేఖతో అరంగేట్రం చేశారు. 11 ఏళ్ల వయస్సులో పాండురంగమహత్యం చిత్రంలో తెలుగులో విజయనిర్మల పరిచయం అయ్యారు. విజయనిర్మల తండ్రిది చెన్నై కాగా, తల్లి గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందినవారు.

Also Read:ప్రతిరోజూ సైకిల్ తొక్కితే..ఎన్ని లాభాలో!

రంగులరాట్నం సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన విజయనిర్మల దాదాపు 200కు పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిగా మెప్పించారు. పూల రంగడు, సాక్షి, అసాధ్యుడు, బంగారు గాజులు, బొమ్మా బొరుసు, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, పాడిపంటలు, అల్లూరి సీతరామరాజు, తాతామనవడు, కురుక్షేత్రం, తదితర చిత్రాల్లో నటించారు. పెళ్లి కానుక సీరియల్‌తో బుల్లితెర ప్రవేశం చేసి అలరించారు.

విజయనిర్మల మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన తర్వాత కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ నటుడు సీనియర్ నరేశ్ ఆమె కుమారుడే. కృష్ణతో కలిసి 47 చిత్రాల్లో ఆమె నటించారు. విజయనిర్మల దర్శకత్వం వహించిన అత్యధిక చిత్రాల్లో హీరోగా కృష్ణ నటించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా విజయ నిర్మల గిన్నిస్ రికార్డులో సాధించారు. 44 సినిమాలకు దర్శకత్వం వహించారు.

Also Read:ఈ టైంలో నీళ్లు తాగండి..ఆరోగ్యంగా ఉండండి!

- Advertisement -