ఢిల్లీకి టీకాంగ్రెస్ నేతలు!

49
- Advertisement -

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు జోరు పెంచారు. పలు పార్టీల వారిని హస్తం పార్టీలో చేర్చుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహుర్తం ఖరారు కాగా మరికొంతమంది ఇదే బాటలో పయనించనున్నారు.

ఇక పొంగులేటి, జూపల్లితో పాటు టీ కాంగ్రెస్ నేతలు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఈ భేటీలో జూపల్లి బృందం పది మంది, పొంగులేటి బృందం 40మంది ఉంటారని సమాచారం.

Also Read:మెంతి ఆకులతో ఇలా చేస్తే.. ఆ సమస్యలు దూరం !

తెలుతర్వాత పొంగులేటి, జూపల్లి కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలతోపాటు కేసీ వేణుగోపాల్‌తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పొంగులేటి, జూపల్లి ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీకానున్న నేపథ్యంలో తెలంగాణలోని పార్టీ ముఖ్యనేతలకు ఢిల్లీ రావాలని అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. కొత్త పాత నేతలను సమన్వయం చేసుకుంటు మందుకుసాగాలని పార్టీ నేతలకు సూచించనున్నట్లు తెలుస్తోంది.

Also Read:ఈ అద్బుతమైన ఆరోగ్య చిట్కాలు.. తెలుసా ?

- Advertisement -