ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలుండగా ఇండియన్ 2 షూటింగ్ వల్ల ఈ సినిమా షూట్ బాగా స్లో అయింది. దీంతో సినిమా రిలీజ్ ఎప్పుడుంటుందో అనే సస్పెన్స్ నెలకొంది. అయితే, ఆ సస్పెన్స్ పై క్లారిటీ వచ్చింది. గేమ్ ఛేంజర్ సినిమా వచ్చే ఏడాది జూన్ లేదా జులైలో రిలీజ్ అయ్యే ఛాన్సుందని ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది.
గేమ్ ఛేంజర్ ఒక పాన్ ఇండియా సినిమా. పైగా అందులోనూ పిరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామా. పల్లెటూరి రాజకీయాలు కూడా ఈ సినిమాలో మెయిన్ పాయింట్. ఇక ఈ సినిమాకి రిలీజ్ డేట్ చాలా ముఖ్యం. ఇండియా వైడ్ గా కలెక్షన్స్ రాబట్టాలి అంటే.. పోటీ తక్కువ ఉండాలి. అటు బాలీవుడ్ లో కూడా పోటీగా ఏ సినిమా లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మేకర్స్.. జూన్ లేదా జులైలో తమ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Also Read: నిఖిల్..‘స్పై’పవర్ ప్యాక్డ్ ట్రైలర్
కాగా రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్ రాజకీయ నాయకుడిగా నటిస్తున్నాడు. రాజకీయ డ్రామా అంటే.. సినిమా కాస్త సీరియస్ టోన్ లో సాగుతుంది అనుకునేరు. కేవలం ప్లాష్ బ్యాక్ మాత్రమే సీరియస్ డ్రామా అట. ఇక మిగిలిన పార్ట్ మొత్తం శంకర్ ఎంటర్ టైన్ గానే సినిమాని డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా మొదట ఫ్యామిలీ డ్రామా అన్నారు. కానీ.. ఇది కూడా పొలిటికల్ డ్రామా అని తెలిసే సరికి ఫ్యాన్స్ కి సినిమా పై ఆసక్తి మరింతగా రెట్టింపు అయింది. మరి చరణ్ కి శంకర్ ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి.
Also Read: లక్ష కోట్ల మెగా ప్రిన్సెస్ డిశ్చార్జ్