హలో ఏపీ.. బై బై వైసీపీ ?

30
- Advertisement -

ఏపీ రాజకీయాలు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది వేడెక్కుతున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేన ఇలా మూడు పార్టీలు కూడా అధికారం కోసం గట్టిగా పోటీ పడుతుండడంతో ఈసారి ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. కాగా ఇప్పటికే అధికారంలో ఉన్న వైసీపీ మరోసారి అధికారం కోసం ఉవ్విళ్లూరుతుంటే.. జనసేన, టీడీపీ పార్టీలు ఈసారి వైసీపీని గద్దె దించాలని బలంగా ఫిక్స్ అయ్యాయి. అందుకే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు టీడీపీ జనసేన పార్టీలు.

ముఖ్యంగా జగన్ సర్కార్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అలాగే జగన్ పాలన విధానంపై వస్తున్న విమర్శలను ఆయుధంగా చేసుకొని వైసీపీని ముప్పెట దాడి చేసేందుకు టీడీపీ, జనసేన పార్టీలు సిద్దమౌతున్నాయి. అందులో భాగంగానే సరికొత్త నినాదాలతో ఎన్నికల సమరానికి సిద్దమౌతున్నాయి. సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటూ టీడీపి నినాదిస్తుంటే.. అటు జనసేన ” పవన్ రావాలి.. పాలన మారాలి ” అంటోంది. ఈ నేపథ్యంలో జనసేనాని మరో నినాదాన్ని తెరపైకి తెచ్చారు. కోనసీమ జిల్లాలోని అమలాపురంలో జరిగిన వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ ” హలో ఏపీ.. బై బై వైసీపీ ” అనే నినాదంతో ముందుకు సాగాలని జనసైనికులకు పిలుపునిచ్చారు.

Also Read: షర్మిల పార్టీ విలీనం.. జగన్ స్కెచ్ యేనా ?

దీంతో ” హలో ఏపీ.. బై బై వైసీపీ ” అనే నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు జనసైనికులు సిద్దమయ్యారు. గత ఎన్నికల టైమ్ లో ” రావాలి జగన్.. కావాలి జగన్ ” అనే నినాదం వైసీపీకి బాగా కలిసొచ్చింది. ప్రజల్లో వైసీపీకి మైలేజ్ పెంచి అందరి దృష్టి జగన్ పై మళ్ళడానికి ఆ నినాదం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. అదే విధంగా ఈసారి జగన్ ను గద్దె దించేందుకు విపక్షాలు కూడా నినాదాల పట్ల ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నాయి. మరి జనసేన అందుకున్న ” హలో ఏపీ.. బై బై వైసీపీ ” నినాదం జగన్ ను ఎంతమేర దెబ్బ తీస్తుందో చూడాలి.

Also Read: KTR:అభివృద్ధి కోసం కేంద్రం సహకరించాలి

- Advertisement -