దగాపడ్డ తెలంగాణ కోసం ఆహార్నీశలు కృషి చేసి సాధించుకున్న తెలంగాణ… కేంద్రం నుంచి తెలంగాణకు దక్కింది శూన్యం. అయిన పట్టువదలని విక్రమార్కుల సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రానికి రావాల్సిన వచ్చేలా భావి భవిష్యత్‌ను సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈమేరకు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ స్పందించారు.
ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇవ్వకున్న తెలంగాణ సాధించిన నాటి నుంచి ఇప్పటివరకు ఐటీ ఎగుమతులు రూ.ఒక లక్ష యాబైవేల కోట్లకు చేరిందని అన్నారు. మైక్రోసాప్ట్, అమెజాన్, గూగుల్ లాంటి ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలను సాధించుకున్నామన్నారు.
జాతీయ హోదా ఇవ్వకున్నా అపర భగీరథుడిలా సీఎం కేసీఆర్ స్వయంగా నడుంబిగించి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లా నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రమని అన్నారు.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకున్నా…కొండల్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకున్నామని కేటీఆర్ అన్నారు. మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకున్నామని అన్నారు. దశాబ్ది ఉత్సవాలల్లో భాగంగా తెలంగాణ అభివృద్ధి పథం వైపు నడుస్తుంటే కాంగ్రెస్, బీజీపీ ఏనాడు మనకు సహాయం చేయలేదని తెలిపారు.
ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇవ్వకున్నా..
దిగ్గజ ఐటి కంపెనీలన్నీ తెచ్చుకున్నం
జాతీయ హోదా ఇవ్వకున్నా..
కాళేశ్వరం ప్రాజెక్టును కట్టుకున్నం
పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తున్నం
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకున్నా..
“మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ”ని
సీఎం కేసీఅర్ గారి చేతుల మీదుగా
ఘనంగా ప్రారంభించుకున్నం
ఒక్క మాటలో చెప్పాలంటే..
ప్రజలకు ఎప్పుడూ అండగా బీఆర్ఎస్..!!
దేశానికి ఎప్పటికీ దండగ – బీజేపీ & కాంగ్రెస్ ..!!!
తెలంగాణ అమలు చేసే పథకాలు దేశం అనుసరిస్తున్నది. అలాగే తెలంగాణ సాధించిన లక్ష్యాలను మరే రాష్ట్రం కూడా దరిదాపులోకూడా లేదు అనేది సత్యమని కేటీర్ అన్నారు. అందుకే సీఎం కేసీఆర్ నాయకత్వంలో అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ అనే లక్ష్యంతో ముందుకెళ్లుతున్నామని తెలిపారు.
Also Read: శంకరమ్మకు సముచిత పదవి!