తృణధాన్యాలు…మోదీ ఫాల్గుణి షా పాట

43
- Advertisement -

భారత్ తృణధాన్యాలను పరిచయం చేస్తూ ప్రపంచానికి తెలియజేయడం కోసం ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. తాజాగా తృణధాన్యాలపై గ్రామీ అవార్డు విజేత ప్రముఖ భారత-అమెరికన్ గాయని ఫాల్గుణి షా ఓ పాటను రూపొందించారు. అయితే ఈ పాటకు భారత ప్రధాని నరేంద్ర మోదీ రచన గానంతో తన సహకారాన్ని అందించారు.

Also Read: KTR:సుపరిపాలన కోసమే వార్డు కార్యాలయం

abundance in millets పేరుతో ఫాలు ఆమె భర్త గౌరవ్ షా ఈ పాటను శుక్రవారం విడుదల చేశారు. ఇంగ్లిష్‌ హిందీలో ఉన్న ఈ పాటను ఫాలు దంపతులతో కలిసి ప్రధాని మోదీతో కలిసి పాడారు. తృణధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాలు వాటి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆకలి ఎలా నిర్మూలించొచ్చన్నది ఈ పాట రూపంలో తెలియజేసే ప్రయత్నం చేశారు. భారత ప్రతిపాదన మేరకు ఈ యేడాదిని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 130కి పైగా దేశాల్లో చిరుధాన్యాలను పండిస్తున్నారు. తృణధాన్యాలు ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ మంది సంప్రదాయ ఆహారంగా పరిగణిస్తారు.

Also Read: చేరికలపైనే.. బీజేపీ భారం ?

- Advertisement -