జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా రూపొందనుంది. “సలార్” తర్వాత తన తదుపరి చిత్రం ఎన్టీఆర్ తోనే అని ప్రశాంత్ నీల్ చాలాకాలంగా చెబుతూ వచ్చారు. దానికి తగ్గట్లే ఇప్పుడు ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. బాలీవుడ్ మీడియా, సోషల్ మీడియా ఈ సినిమా లాంచ్ గురించి ప్రచారం మొదలు పెట్టాయి. దసరాకి ఈ సినిమా షూటింగ్ షురూ అవుతుందనేది ఈ కథనాల సారాంశం. కానీ, ప్రశాంత్ నీల్ అలాంటివి పట్టించుకోరు. దసరా నాడు సినిమా మొదలుపెట్టాలి వంటి పనులు చెయ్యరు ప్రశాంత్ నీల్.
సినిమా లాంఛనంగా ఎప్పుడు లాంచ్ అయినా విడుదల తేదీ విషయంలో మాత్రం ప్రశాంత్ నీల్ ఒక ప్లాన్ లో ఉన్నారట. 2024లోనే సినిమా విడుదల అయ్యేలా షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ సాధారణంగా ఒక్కో సినిమాని మూడేళ్లు తీస్తారు. కానీ, ఈ సారి మాత్రం మూడేళ్లు కాకుండా రెండు ఏళ్లలోపే విడుదల చేస్తారట.
Also Read: 50 ఏళ్ల వయసులో తండ్రైన ప్రభుదేవా..
కొరటాల శివ తీస్తున్న ‘దేవర’ సినిమా కూడా వచ్చే ఏడాది లోనే విడుదల అవుతుంది. ఇక ప్రశాంత్ నీల్ చిత్రం 2024లో విడుదల చేస్తే పెద్ద గ్యాప్ ఉండదు. పైగా ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా పాన్ ఇండియా సినిమా. కాబట్టి.. 2024లో విడుదల కాకుండా 2025 లో సినిమా రిలీజ్ ను ప్లాన్ చేస్తే బాగుంటుందని మేకర్స్ ఆలోచన. మరి ప్రశాంత్ నీల్ చివరకు ఏం చేస్తాడో చూడాలి.
Also Read: అవును అతడితో రిలేషన్ షిప్లో ఉన్నా:తమన్నా