KTR:రాష్ట్రంలో చెరువుల పండుగ

42
- Advertisement -

ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా చెరువుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ప్రభుత్వం.తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రం ఏర్పాటు తరువాత చెరువుల పునరుద్ధరణ, ఆయకట్టు స్థిరీకరణ,చెక్ డ్యామ్ ల నిర్మాణం చేపట్టింది.

ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. చెరువే ఊరికి ఆదరువు అని కవితను ట్వీట్ చేశారు.

పదేళ్ల క్రితం…
ఏ చెరువును చూసినా గుండెబరువు..వాటిపై ఆధారపడిన కులవృత్తులకు లేదు బతుకుదెరువు
కానీ..దశాబ్ది ఉత్సవాల వేళ..ప్రతి చెరువు…కరువును శాశ్వతంగా తీర్చిన కల్పతరువు

చుక్కనీరు లేక చిక్కిశల్యమైన
అమ్మలాంటి ఊరి చెరువుకు
ఊపిరిపోసిన నాయకుడు…
గొలుసుకట్టు చెరువుల
గోస తీర్చిన పాలకుడు…

ముఖ్యమంత్రి కేసిఆర్ గారు…
చెరువులకు పట్టిన
దశాబ్దాల శిలుమును

వదిలించిన విప్లవం పేరే..
మిషన్ కాకతీయ
“వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా”
మెచ్చిన పథకమిది“

మిచిగాన్ యూనివర్సిటీ”కి
నచ్చిన పథకమిది

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు
ప్రాణం పోసిన తరుణమిది
పొలిమేరల్లో ఉన్న చెరువును
ప్రతి గుండెకు చేరువ చేసిన చరిత్ర ఇది..

అమృతోత్సవ వేళ
మన మిషన్ కాకతీయ
దేశానికే ఆదర్శమైంది..

“తెలంగాణ మోడల్”
“అమృత్‌ సరోవర్‌” రూపంలో
దేశవ్యాప్తంగా ఆవిష్కృతమైంది..

మండువేసవిలో
మత్తడి దుంకుతున్న చెరువుల సాక్షిగా…
ఈ మహాయజ్ఞంలో
మనసుపెట్టి పనిచేసిన ప్రతిఒక్కరికి…

దశాబ్ది ఉత్సవాల సందర్భంగా
చెరువుల పండుగ శుభాకాంక్షలు…

- Advertisement -