మోచేతులు నల్లగా ఉన్నాయా.. ఇలా చేయండి !

55
- Advertisement -

చాలమందికి మోచేతులు మరియు మోకాళ్ళు నల్లగా ఉంటాయి. ఇలా అవడానికి కారణం అక్కడ దుమ్ము ధూళి పెరుకుపోయి ఈ విధంగా అవుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే అక్క్ద చర్మం కూడా కాస్త బిగుతూగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్స్ కు కూడా దారి తీస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ నల్లటి వలయాల కరణంగా దురద, పొక్కులు కూడా ఏర్పడతాయి. మోకళ్లపై లేదా మోచేతులపై నల్లటి వలయాలు ఉన్నవాళ్ళు షార్ట్ లెన్త్ డ్రస్సులు వేసుకోవడానికి తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈ నల్లని వలయాలకు చెక్ పెట్టేందుకు వంటింటి చిట్కాలు చక్కగా పని చేస్తాయి. అవేంటో చూద్దాం !

బంగాళదుంప నుంచి రసం తీసి ఆ రసాన్ని నల్లగా ఉన్న మోచేతులపై లేదా మోకళ్లపై అప్లై చేసి, 15 – 20 నిముషాలు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ ఒక నెల పాటు చేస్తే నల్లటి వలయాలు లేదా మచ్చలు తొలిగి పోతాయి. ఇంకా ఈ వలయాలను తగ్గించడంలో కలబంద కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది. కలబందలోని గుజ్జును నల్లటి వలయాలపై తరచూ అప్లై చేసుకుంటే మోచేతులు మరియు మోకాళ్ళు మృదువుగా మారడంతో పాటు ప్రకాశవంతంగా అవుతాయి. ఇంకా బాదం నూనె ను నల్లటి వలయాలపై రాసి కొద్ది సేపు అక్కడ మసాజ్ చేసి ఆ తరువాత కడిగేసుకోవాలి.

Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే

ఇలా చేయడం వల్ల అక్కడ పెరుకుపోయిన దుమ్ము, ధూళి శుభ్రం అవుతాయి. ఇంకా నల్లటి వలయాలను తొలగించడంలో నిమ్మరసం కూడా ఉపయోగ పడుతుంది. కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని అక్కడ మర్ధన చేసి ఆ తరువాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇంకా నిమ్మకాయ ముక్కను పంచదారలో అద్ది మోకళ్లపై లేదా మోచేతులపై రుద్దిన నల్లటి వలయాలు తోకగిపోతాయి. వంటసోడాలో కొద్దిగా నీరు, ఉప్పు కలిపి నల్లటి వలయాలపై అప్లై చేసి 20 – 30 నిముషాల తరువాత కడిగేసుకుంటే ఆ వలయాలు లేదా మచ్చలు తొలగిపోతాయి. ఇలా వంటింటి చిట్కాల ద్వారానే మోకళ్లపై లేదా మోచేతులపై నల్లటి వలయాలను సులభంగా తొలగించుకోవచ్చు.

Also Read:ఈ కోర్సులు చేస్తే..ఉద్యోగాలు గ్యారెంటీ

- Advertisement -