వివాదంలో ‘ఆదిపురుష్’ దర్శకుడు

32
- Advertisement -

ప్రభాస్, కృతి సనన్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా జరిగింది. ఈ మేరకు దర్శకుడు ఓం రౌత్ చేసిన పని ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. తిరుమల శ్రీవారిని ఓం రౌత్ దర్శించుకున్న అనంతరం గుడి వెలుపల కృతి సనన్ ను ముద్దుపెట్టుకుని, హత్తుకున్నారు. ఈ సన్నివేశాన్ని చూసిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దర్శకుడు ఆమెకు సెండాఫ్ ఇచ్చినట్లు సినీవర్గం చెబుతోంది. ఇదిలా ఉంటే.. ఆదిపురుష్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ఓం రౌత్ భావోద్వేగానికి లోనైయ్యారు.

సినిమా ప్రదర్శించే ప్రతి హాలులో ఓ సీటుని హనుమంతుడికోసం రిజర్వ్ చేసి ఉంచాలని ఆయన కోరారు. ఈ సందర్బంగా ఓం రౌత్ కాస్త భావోద్వేగానికి లోనైయ్యారు. రామనామ పారాయణం జరిగే చోటుకి హనుమంతుడు కచ్చితంగా వస్తాడని తన తల్లి చెప్పినట్లు చెప్పారు. రౌత్ ప్రతిపాదనకు నిర్మాతలు అంగీకరించారు. ఇక ‘ఆదిపురుష్‌’ సినిమా తమ సినిమా కాదు, ప్రభాస్‌ సినిమా కాదు, ఇది భారతీయులు సినిమా అని దర్శకుడు ఓం రౌత్‌ అన్నారు.

Also Read:ఈ కోర్సులు చేస్తే..ఉద్యోగాలు గ్యారెంటీ

ఓం రౌత్ ఇంకా మాట్లాడుతూ.. ప్రభాస్‌ లేకపోతే ఈ సినిమా లేదని, ప్రభాస్‌ వల్లే ఈ సినిమా సాధ్యమైందని ఎమోషనల్ అయ్యారు. నిర్మాత భూషన్ కుమార్‌తో ఉన్న బాండింగ్‌ మరువలేనిది అని, ఆయన మాటలు తనని ఎమోషనల్‌కి గురి చేశాయని ఓం రౌత్ పేర్కొన్నారు. మొత్తానికి ఓం రౌత్ తన మాటలతో చేష్టలతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.

Also Read:Adipurush:అంతిమ విజయం సత్యానిదే

- Advertisement -