యంగ్ హీరో నితిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన, టాలెంటెడ్ మేకర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో #VNRTrio ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.
ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర బృందం చెన్నైలో మ్యూజిక్ సిట్టింగ్ లను ప్రారంభించింది. ప్రముఖ లిరిక్ రైటర్ శ్యామ్ కాసర్ల కూడా #VNRTrio లో చేరారు. పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి. ఈ కాంబినేషన్ ప్రేక్షకులకు పండగలా వుండబోతుంది.
ఈ చిత్రంలో నితిన్ స్టైలిష్ అవతార్ లో కనిపిస్తుండగా, రష్మిక మందన అల్ట్రా-మోడరన్ లుక్ లో కనిపించనుంది. నితిన్, రష్మిక పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో కీలక పాత్రలలో కనిపిస్తారు.
Also Read: ఉఫ్.. ఈ డైరెక్టర్ ని ఎవరికైనా చూపించడ్రా
సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు.
Also Read: జూన్ 8:#NBK108 టైటిల్, ఫస్ట్ లుక్