ఎన్టీఆర్ తో ప్రియాంక.. 30 కోట్లు

41
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా సినిమా స్టార్ట్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పై ఇప్పటి వరకు అనేక వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా హలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించబోతుందని టాలీవుడ్ లో రూమర్ వైరల్ అవుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే.. మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు. ఏది ఏమైనా ఎన్టీఆర్ తో ప్రియాంక చోప్రా నటిస్తే.. ఈ కాంబినేషన్ అదిరిపోతోంది.

ఇక ప్రశాంత్ నీల్ ఈ సినిమాని ప్రారంభించడానికి, సెట్ మీదకు తీసుకువెళ్లడానికి చాలా టైమ్ పడుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ప్రిపరేషన్, మేకోవర్, డిస్కషన్లు, ప్రీ ప్రొడక్షన్ ఇలా ప్రతిదీ చాలా డిటైలింగ్ గా వుంటుంది ప్రశాంత్ నీల్ దగ్గర. పైగా ఎన్టీఆర్ తో మాస్ సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ స్క్రిప్ట్ లో కూడా ఇన్ వాల్వ్ అవుతాడు. ఎన్టీఆర్ కి స్క్రిప్ట్ పై మంచి పట్టు ఉంటుంది. అందుకే.. గత ఆరు సినిమాల నుంచి తారక్ కి ఒక్క ప్లాప్ కూడా లేదు. అందువల్ల స్క్రిప్ట్ కు ఎక్కువ టైమ్ కావాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే.. వచ్చే ఏడాది మార్చి నుంచి సినిమా స్టార్ట్ చేయనున్నారు.

Also Read: మహేష్ తో కాజల్ రొమాన్స్

అయితే, ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ 30 కోట్లు అని తెలుస్తోంది. ఒకవేళ ప్రియాంక చోప్రాకి ఆ రేంజ్ రెమ్యునరేషన్ ఇస్తే.. బడ్జెట్ ఓవర్ అవుతుంది. కాబట్టి.. ఎన్టీఆర్ ఈ సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకోకుండా.. లాభాల్లో వాటా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: మనం పర్‌ఫెక్ట్‌ కాదు కానీ…!అనసూయ

- Advertisement -