వేసవిలో అందరికీ ఇష్టమైన పండు పుచ్చకాయ. కేవలం ఈ సీజన్ లో మాత్రమే దొరికే పుచ్చకాయ వేసవి తాపాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో 90 శాతం నీరు అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో కెరోటినాయిడ్స్, బీటాకెరోటిన్ లు, విటమిన్ ఏ, సి, బి6 వంటి వాటితో పాటు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఇతర పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. వీటి వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. అలాగే శరీర ఉష్ణోగ్రత ను సమతుల్య పరచడంలో కూడా పుచ్చకాయ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే పుచ్చకాయ వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి.
పుచ్చకాయ ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు తలెత్తే ఆవకాశం ఉంది. ఇదిలా ఉంచితే పుచ్చకాయను పగలు రాత్రి తేడా లేకుండా తింటూ ఉంటారు చాలామంది. ఇలా తినడం అసలు మంచిది కాదట. పగటి పూట ఏ సమయంలోనైనా పుచ్చకాయ తినవచ్చు గాని రాత్రి వేళ మాత్రం పుచ్చకాయ కు దూరంగా ఉండాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు పుచ్చకాయ తింటే ప్రకోప పేగు సిండ్రోమ్ అనే పేగువ్యాది వచ్చే ఆవకాశం ఉందట. అంతేకాకుండా నిద్ర లేమి సమస్య కూడా ఏర్పడుతుందట. ఇంకా రాత్రి భోజనం చేసిన తరువాత కూడా పుచ్చకాయ తినరాదట. ఎందుకంటే అజీర్తి ఏర్పడి.. అ సమస్య వాంతులు విరోచనాలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఇందులో ఉండే షుగర్ కారణంగా బరువు పెరిగే ఆవకాశం ఉంది. అలాగే రాత్రి పూట పుచ్చకాయ తింటే అతి ముత్రానికి దారి తీస్తుంది కాబట్టి పుచ్చకాయ ను రాత్రిపూట తినడం అసలు మంచిది కాదని నిపుణుల సలహా.
Also Read:చంద్రబాబు దర్శకత్వంలో రేవంత్:ఎర్రోళ్ల