నేటి రోజుల్లో పాలిటిక్స్ కు అర్థం మారిపోయిందా ? పాలిటిక్స్ పూర్తి కమర్షియల్ గా మారయా ? అంటే అవుననే అంటున్నారు రాజకీయాల్లోని సీనియర్ నేతలు. ఒకప్పుడు ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తూ రాజకీయ నాయకుడు అంటే ఇలాగే ఉండాలి అనే ఎంతో మంది చెప్పారు. ప్రజాసేవలో ఉండే ఆనందాన్ని ఆస్వాదిస్తూ రాజకీయల్లో చెరగని ముద్రా వేసిన మహా నేతలు ఎందరో.. అందుకే రాజకీయ నాయకులకు సమాజంలో ఎంతో గౌరవం ఉంటుంది. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు స్వలాభం కోసమే రాజకీయం చేస్తూ ప్రజా శ్రేయస్సును పూర్తిగా గాలికి వదిలేశారు.
ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బు పంచుతూ అధికారంలోకి వచ్చిన తరువాత ఖర్చు చేసిన డబ్బుకు పదంతలు దోచుకోవడమే ప్రస్తుత నేతల ప్రధాన ఎజెండా. ప్రజలతో మమేకం అవుతూ ప్రజాసమస్యలు తీర్చే నాయకులు గతంలోనే తప్పా ప్రస్తుత రోజుల్లో కనుచూపు మేరలో కూడా కనిపించరనేది రాజకీయ వాదులు తరచూ చెప్పే మాట. అందుకే ఒకప్పుడు రాజకీయాలను.. ప్రస్తుత రాజకీయాలను బేరీజు వేసిన చాలా మంది నేతలు రాజకీయాలకు స్వస్తి చెబుతున్నారు.
Also Read: CM KCR:దేశానికే తలమానికంగా తెలంగాణ అభివృద్ధి
మన దేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా నేటి రాజకీయాలపై ఎంతో అసహనం వెళ్లగక్కి ప్రస్తుతం రాజకీయాలకు దూరమయ్యారు. ఇక త్వరలోనే కాంగ్రెస్ లోని సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాలిటిక్స్ కు రిటైర్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఒక తన రిటైర్మెంట్ పై అధికారికంగా ప్రకటిస్తానని స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. నేటి రాజకీయాలు ఎంతో కమర్షియల్ గా మారాయని ఈ కమర్షియల్ రాజకీయాల నుంచి త్వరగా తప్పుకోవడమే గౌరవంగా ఉంటుందని ఆయన భావిస్తున్నారట. ఇంకా ఇతరత్రా పార్టీలలోని చాలా మంది సీనియర్ నేతలు కూడా ప్రజెంట్ పాలిటిక్స్ లో ముందుకురాలేక..వారి రాజకీయ జీవితానికి ముగింపు పలకాలని చూస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే నిజంగానే నేటి పాలిటిక్స్ కమర్షియల్ గా మారాయని చెప్పక తప్పదు.
Also Read: తెలంగాణ ఆచరిస్తుంది..దేశం అనుచరిస్తుంది: కేటీఆర్