టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ మరోసారి సంచలన కామెంట్ చేసింది. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆమెకు ఓ ప్రశ్న ఎదురైంది. పెళ్లికి ముందు పిల్లల్ని కనడాన్ని మీరు ఎలా భావిస్తారని అడగగా శృతిహాసన్ మాట్లాడుతూ.. ఇందులో తప్పేముంది. పిల్లల్ని కనే హక్కు ఆడవారికి మాత్రమే ఉంది. వారు ఎప్పుడైనా ఆ నిర్ణయం తీసుకోవచ్చని కామెంట్ చేసింది. శృతి కూడా వారి తల్లికి పెళ్లి కాక ముందే జన్మించడం గమనార్హం. దాంతో నెటిజన్లు శృతి హాసన్ పై విమర్శలు చేస్తున్నారు. పుట్టుకలోనే తప్పు ఉన్నప్పుడు.. పుట్టాక తప్పుడు పనులు ఎందుకు చేయరు ? అంటూ తమ హద్దులు దాటి నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
అయితే, శృతి హాసన్ మాత్రం తన పై ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోను అంటుంది. తన కెరీర్ మొదట్లో కూడా తాను చాలా విమర్శలు ఎదుర్కొన్నాను అని, ముఖ్యంగా నా ముక్కు బాగా లావుగా ఉండేది. దాంతో ఆ అంశం పై బాగా నెగిటివ్ గా నన్ను ట్రోల్ చేశారు. అది ముక్కు లా లేదే, ఏదో చెక్కలా ఉంది అంటూ నా పై హేళనగా మాటలు మాట్లాడారు. ఆ సమయంలో నేను చాలా బాధ పడ్డాను. కమల్ హాసన్ లాంటి స్టార్ హీరో కూతురికే ఇలా జరిగితే ఇక సాధారణ నటి పరిస్థితి ఏమిటి ?, అందుకే, అప్పటి నుంచి నేను ఎలాంటి విమర్శలు పట్టించుకొను.
Also Read: ఎన్నో ఎత్తుపల్లాలను చూసిందట
ఐతే, ఆ విమర్శల తర్వాత నా ముక్కుకి సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఐతే, విచిత్రంగా సర్జరీ తర్వాత కూడా శృతిహాసన్ పై ఆమె స్నేహితులే నెగిటివ్ గా కామెంట్స్ చేసేవారట. కానీ శృతిహాసన్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా నటన పై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
Also Read: జూన్4: భోళాశంకర్ ఫస్ట్‌లిరికల్ సాంగ్

