- Advertisement -
టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తీపికబురు అందించారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు డీఏ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. జూన్ నెల వేతనంతో కలిపి డీఏ చెల్లించనుంది. ఈమేరకు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించారు. గతేడాది జూలై నెలలో ఇవ్వాల్సి ఉన్న 4.9శాతం డీఏను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.
Also Read: దట్ ఈజ్ కేటిఆర్..!
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ సిబ్బంది చురుకైన పాత్ర పోషించారు. 2011లో 29రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని గుర్తు చేసుకున్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్న కార్మికులకు మాత్రం ఏడు డీఏలను మంజూరు చేసింది. మిగిలిన ఒక్క డీఏను త్వరలోనే ఉద్యోగులకు ప్రకటిస్తుందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
Also Read: KTR:హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్..మరీ మీకు ఎవరు.?
- Advertisement -