CM KCR:బ్రహ్మణులకు వరాల జల్లు

63
- Advertisement -

సర్వజన హితం బ్రహ్మణుల లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్. బ్రహ్మణుల మనసు,మాట లోకజన హితం కోసమే అన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామంలో నిర్మించినవిప్రహిత బ్రాహ్మణ సదనం భవనాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ సుర‌భి వాణిదేవీ, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ర‌మ‌ణాచారి, పీఠాధిప‌తులు, పండితులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం…బ్రహ్మణుల్లో పేదలున్నారని వారిని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఏడాదికి వంద కోట్ల చొప్పున నిధులను బ్రహ్మణ పరిషత్‌కు కేటాయిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 789 మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకు సాయం అందించామన్నారు. బ్రహ్మణ సదన్ నిర్మాణం ద్వారా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ బ్రహ్మణ సదన్ ఆద్మాత్మిక,భక్తికి కేంద్రంగా మారనుందన్నారు.

Also Read:SSMB28:మహేష్ మాస్ లుక్‌

దేశంలో బ్రాహ్మణ సదన్ నిర్మించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. సర్వజన సమాదరణ తెలంగాణ ప్రభుత్వ విధానం అన్నారు.సూర్యపేట, ఖమ్మంలో కూడా బ్రహ్మణ సదన్‌ భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. బ్రహ్మణ పరిషత్ ద్వారా వేద పండితులకు ఇస్తున్న భృతిని రూ.5 వేలకు పెంచుతున్నామని చెప్పారు. 3645 దేవాలయాలకు దూప,దీప నైవేధ్య పథకం వర్తిస్తుందని మరిన్ని ఆలయాలకు విస్తరిస్తున్నామని చెప్పారు.

దూప,దీప నైవేధ్య పథక నిధులను రూ. 10 వేలకు పెంచుతున్నామని చెప్పారు. బ్రహ్మణ విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని వర్తింప చేస్తామన్నారు. అర్చకుల మిగిత సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

Also Read:Amla:ఉసిరితో ఉపయోగాలు

ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామంలో 6 ఎకరాల 10 గుంటల స్థలాన్ని కేటాయించింది. ఇందులో బ్రాహ్మణ సమాజ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 12 నిర్మాణాలను చేపట్టారు. మూడంతస్థుల్లో ఉన్న ఈ భవనంలో కల్యాణ మండపం, సమాచార కేంద్రం, పీఠాధిపతుల, ధర్మాచార్యుల సద నం ఉన్నాయి. భక్తి, ఆధ్మాత్మిక భావజాల వ్యాప్తికి సంబంధించిన సమస్త సమాచార కేంద్రంగా, రిసోర్స్‌ సెంటర్‌గా ఈ భవనం సేవలందించనుంది.

- Advertisement -