నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ) 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భారత్ మా తుజే సలామ్ అనే కొత్త పాటను విడుదల చేశారు. ఈ పాటను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహన్ సోమవారం విడుదల చేశారు. ఈ పాటను ఎన్డీఏ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ యూట్యూబ్ వెబ్‌సైట్‌లో విడుదల చేశారు. ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సుఖ్‌వీందర్ సింగ్ ఈ పాటను పాడగా..కుమార్ సాహిత్యం అందించారు. సుశాంత్ మరియు శంకర్ ఈ పాటను స్వరపరిచారు. ఈ పాటకు సమర్ ఖాన్ దర్శకత్వం వహించారు.
Also Read: ఆర్చరీలో సత్తా చాటిన టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు
రెండవ ప్రపంచయుద్ద కాలం నుంచి ఈ సంస్థను ప్రారంభించిన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ సైనిక వ్యవస్థను బలోపేతం చేయడానికి దీనిలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. భారత త్రివిధ దళాలకు ఎంపికయిన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనుంది. అకాడమీ అందించిన సహకారాన్ని వివరించే విధంగా పాటను రూపొందించారు. ఈ పాట సాయుధ దళాలకు దేశం పట్ల అంకితభావం, త్యాగ స్ఫూర్తిని బలపరుస్తుందని అధికారులు తెలిపారు.