మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. భోళా శంకర్ సినిమా పాటలను త్వరలో విడుదల చేయనున్నట్లు మూవీ టీం ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ‘సిద్ధంగా ఉండండి.. భోళా మేనియా స్టార్ట్స్ సూన్’ అంటూ ఆ పోస్టర్ లో రాసుకొచ్చింది. ఈ మూవీకి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. సాంగ్స్ అన్నీ చాలా బాగా వచ్చాయట. తన తనయుడి ఎదుగుదల కోసం ఈ సినిమాలో రెండు పాటలను స్వయంగా మణిశర్మనే కంపోజ్ చేశాడట. కాకపోతే.. కొడుకు భవిష్యత్తు కోసం ఆ రెండు పాటలకు తన పేరుకు బదులుగా కొడుకు పేరే వేశాడు.
ఈ భోళా శంకర్ ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. చిరంజీవి సోదరిగా నటిస్తున్న కీర్తి సురేశ్‌కు ప్రియుడిగా సుశాంత్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. అతని కోసం సినిమాలో ఆ పాత్ర నిడివిని పెంచారని టాక్. ఓ పాటలో సైతం సుశాంత్ కనిపిస్తాడని అంటున్నారు. ఇక మెహర్ రమేష్ తో తానూ చేస్తున్న ఈ ‘భోళా శంకర్’ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాలని ఆశ పడుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకే మెగాస్టార్ ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు.
Also Read: ఇలా ఐతే ఎలా అనిల్ రావిపూడి ?
ఈ సినిమాలో మెగాస్టార్ పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయి. సినిమాలోనే ఈ షేడ్స్ హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ సినిమాలో దర్శకుడు మెహర్ రమేష్ రెండు మాస్ ట్రాక్ లు యాడ్ చేశారు. మాస్ ఎలివేషన్లను మెహర్ రమేష్ చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు. పైగా మాస్ ఎలివేషన్లలో మెగాస్టార్ చిరంజీవి కూడా అదిరిపోతారు. మొత్తానికి సిస్టర్ సెంటిమెంట్ తో పాటు భారీ యాక్షన్ టచ్ తో ఈ ‘భోళా శంకర్’ రాబోతున్నాడు. మరి ఈ ‘భోళా శంకర్’ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: బన్నీ గర్ల్ ఫ్రెండ్ పై స్నేహరెడ్డి రియాక్షన్