హ్యాపీ బర్త్ డే..పరేష్ రావల్

42
- Advertisement -

పరేష్ రావల్..భారతీయ సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. విలన్‌గా రాజకీయ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇవాళ ఆయన బర్త్ డే సందర్భంగా greattelangaana.com శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

1950, మే 30 న బాంబేలో పుట్టి పెరిగారు పరేష్ రావల్. ముంబైలోని, విలె పార్లెలో గల నర్శీ మాంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనమిక్స్ కళాశాలలో చదివారు. తర్వాత నటి స్వరూప్ సంపత్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఆదిత్య, అనిరుధ్ అనే ఇద్దరు కొడుకులున్నారు. స్వరూప్ సంపత్ 1979 లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో విజేత.

Also Read:IPL 2023:ఐదోసారి విజేతగా చెన్నై

1984 లో వెండితెరకు పరిచయం అయ్యారు పరేష్. ముఖ్యంగా 1980 – 1990 లలో విలన్ పాత్రలను పోషించి మెప్పించారు. 1986 లో వచ్చిన నామ్ అనే హిందీ చిత్రంతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. 1980-90 దశకాల్లో సుమారు వంద సినిమాలకు పైగా నటించాడు. వీటిలో చాలావరకు ప్రతినాయక పాత్రలే. రూప్ కీ రాణీ చోరోం కా రాజా, కబ్జా, కింగ్ అంకుల్, రాం లఖన్, దౌడ్, బాజీ హిట్ సినిమాలు.

Also Read:IPL 2023:ఎవరికి ఎంత ప్రైజ్‌మనీ అంటే?

తెలుగులో గోవిందా గోవిందా, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తుండగానే రాజకీయాల్లోకి ప్రవేశించారు పరేష్ రావల్. బీజేపీలో చేరిన ఆయన అహ్మదాబాద్ నియోజకవర్గం నుండి 2014లో ఎంపీగా గెలిచారు.

- Advertisement -