హీరోయిన్ శ్రియా రెడ్డి మళ్ళీ బిజీ అవుతున్నారు. ఇంతకీ ఈ ‘శ్రియా రెడ్డి’ ఎవరు అనుకుంటున్నారా ?, “అప్పుడప్పుడు”, “అమ్మ చెప్పింది” వంటి సినిమాల్లో ఆమె నటించి మెప్పించింది. హీరో విశాల్ సోదరుడు విక్రమ్ కృష్ణను శ్రియా రెడ్డి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు దూరమైంది. ఐతే, 40 ఏళ్ల శ్రియా రెడ్డి ఇప్పుడు మళ్ళీ మేకప్ వేసుకున్నారు. ఆమె ప్రభాస్ హీరోగా క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీస్తున్న ‘సలార్’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ని కూడా శ్రియా రెడ్డి పూర్తి చేశారు. ఈ విషయాన్ని శ్రియా రెడ్డి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
శ్రియా రెడ్డి హీరోయిన్ గా ఇప్పటివరకు మంచి సినిమాలు చేయగా, ఆమెకు తమిళంలో మంచి పాపులారిటీ దక్కింది. పైగా శ్రియా రెడ్డి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటించాలని ప్రస్తుతం ప్లాన్ చేస్తోంది. ఎలాగూ ప్రభాస్ సలార్ సినిమా చేస్తోంది కాబట్టి.. మళ్లీ ఫామ్ లోకి వస్తాను అంటుంది. అందుకే, ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ హీరోయిన్ గా లేదా నటిగా అయినా మళ్ళీ బిజీ అవ్వాలని శ్రియా రెడ్డి ఆశ పడుతుంది.
Also Read: నాందికి ఉన్న క్రేజ్ నిలబెడుతుంది :సతీష్ వర్మ
ఈ 40 ఏళ్ల బ్యూటీ ఇటీవల బాగా సన్నబడింది. శ్రియా రెడ్డి స్లిమ్ గా మారడమే కాకుండా స్కిన్ ట్రీట్ మెంట్ తో మరింత యంగ్ గా కనిపిస్తున్నారు. దాంతో, శ్రియా రెడ్డికి మళ్ళీ అవకాశాలు పెరిగాయి. నేచురల్ యాక్టింగ్ చేసే శ్రియా రెడ్డి ఇప్పుడు చెన్నై టు హైదరాబాద్ తిరుగుతూ ఉంది. తెలుగులో అవకాశాలు పెరిగితే.. హైదరాబాద్ లోనే మకాం పెడుతుందట.
Also Read: may29:పృథ్వీరాజ్ కపూర్ వర్థంతి