may29:పృథ్వీరాజ్ కపూర్ వర్థంతి

42
- Advertisement -

భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే సినిమా రంగం అడుగుపెట్టింది. అప్పుడప్పుడే మూకీ చిత్రాల ద్వారా సినిమా రంగం మొదలైంది. అలాంటి సమయంలో పెషావర్ నుంచి బాంబేకు వచ్చి ఇప్పుడు బాలీవుడ్‌లో ఐదవ తరం నట వారసత్వ సంపదను కొనసాగిస్తున్నారు. వారే కపూర్ ఫ్యామిలీ. దీనికి ఆధ్యుడు పృథ్వీరాజ్‌ కపూర్‌. ఈయన తండ్రి బసేశ్వరనాథ్ కపూర్ వృత్తిరీత్యా పోలీసు ఆధికారి. పృథ్వీరాజ్ కపూర్‌ రాంసరణి మెహ్రాను వివాహం చేసుకున్నారు. వీరికి రాజ్‌ కపూర్‌, శశికపూర్, షమ్మీ కపూర్‌ కొడుకులు ఊర్మిళ సియాల్ కూతురు కూడా ఉంది.

పృథ్వీరాజ్ కపూర్‌కు చిన్నప్పటి నుంచి నాటకాల పిచ్చి. దీంతో కాలేజీ రోజుల్లో నాటకాలు వేశారు. ఆ తర్వాత స్నేహితుల దగ్గర కొంత డబ్బు తీసుకొని బొంబాయికి వచ్చారు. మొదట్లో ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీలో చేరాడు. ఇక అక్కడి నుంచి మూకీ చిత్రాలలో పనిచేయడం ప్రారంభించారు. పృథ్వీరాజ్‌ తన మొదటి సినిమాకు ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. కానీ రెండవ సినిమా అయిన గర్ల్‌కు మాత్రం రూ.70 తీసుకున్నారు. అయితే మొదటి సారి అలం ఆరా సినిమాలో ప్రతినాయకుడి పాత్రను పోషించారు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో పృథ్వీ థియేటర్‌ను ప్రారంభించారు. కానీ సినిమాల సంఖ్య పెరగడంతో నాటకాలు చూడటం మానేశారు. దీంతో మళ్లీ సినిమా థియేటర్‌ ప్రారంభించారు.

Also Read: 81st Bday:సూపర్‌ స్టార్‌కు మళ్లీ పెళ్లి అంకితం

పృథ్వీరాజ్ కపూర్‌ చివరి సినిమా మొఘల్-ఏ-ఆజం ఇందులో అక్బర్‌గా నటించి విమర్శకుల మెప్పును సైతం పొందగలిగారు. ఈయన మే29,1972లో క్యాన్సర్‌తో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. ఈయనికి 1968లో పద్మభూషణ్‌ మరియు 1971లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు వరించాయి. కపూర్‌ ఫ్యామిలీలో ప్రస్తుతం ఐదవ తరం నటులు ఉన్నారు.

Also Read: రామ్ చరణ్, విక్రమ్ రెడ్డిల ‘V మెగా పిక్చర్స్’

- Advertisement -