PMMODI:దేశ ప్రజలందరూ గర్వపడాలి

40
- Advertisement -

నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంగా అంగరంగా వైభవంగా వేద మంత్రోచ్ఛరణల మధ్య అలాగే సర్వ మత ప్రార్థనల మధ్య జరిగింది. ఈ సందర్భంగా పీఎం మోదీ మాట్లాడుతూ…ఇది 140కోట్ల ప్రజల ఆకాంక్షల కలల ప్రతిబింబమని కొనియాడారు. ప్రపంచానికి భారత్ దృఢ సంకల్ప సందేశం ఈ కొత్త భవనం ఇస్తుందన్నారు.

నవ భారత్ కొత్త మార్గాలు నిర్ధేశించుకుంటూ ముందెకెళ్తోంది. కొత్త ఆలోచనలు సంకల్పంతో భారత్ ప్రగతి పథాన పయనిస్తోందన్నారు. ప్రపంచం మొత్తం మన దేశ సంకల్పం అభివృద్ధిని గమనిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. చారిత్రాత్మకమైన రోజు దేశ ప్రజలందరూ గర్వపడాలి. గత పార్లమెంటు భవనం ప్రగతికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. స్వాతంత్ర్య ప్రాప్తి రాజ్యాంగ నిర్మాణం వంటి అనేక చారిత్రక ఘట్టాలకు సాక్షిగా నిలిచిందని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త భవనం ఆవశ్యకత ఏర్పడిందని అందుకే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన భవనం నిర్మాణం జరిగిందని ప్రధాని మోదీ అన్నారు.

Also Read: నాన్ బీజేపీ పార్టీలు ఒక్కటి కావాలి: అరవింద్

- Advertisement -