సీనియర్ నటుడు నరేశ్ తో ప్రేమ వ్యవహారం తర్వాత పవిత్ర లోకేశ్‌కు బాగా గుర్తింపు వచ్చింది. ఇటీవల వీరిద్దరు నటించిన ‘మళ్ళీ పెళ్లి’ నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటించేందుకు పవిత్ర భారీ రెమ్యునరేషన్ తీసుకుందట. గతంలో పవిత్ర లోకేష్ రోజుకు రూ.50 వేలు తీసుకునేదని, నరేశ్ ప్రేమ వ్యవహారంతో ఫేమస్ కాగా, రోజుకు లక్ష వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. పైగా ఆమె వరుస సినిమాలతో బిజీ అవుతోంది. నిజానికి లేటు వయసులో ప్రేమలో పడి పవిత్ర లోకేశ్ బ్యాడ్ అయింది అనుకున్నారు. కానీ, ఆమెకు ఇంకా క్రేజ్ ఉండటం చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.
దీనికితోడు నరేశ్, పవిత్ర లోకేశ్ జంటగా రూపొందిన మళ్ళీ పెళ్లి చిత్రానికి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ రోజు కూడా ఈ సినిమాకి హౌస్ ఫుల్ కలెక్షన్స్ రావడం విశేషం. సో.. ఈ సినిమా విజయమే తమ ప్రేమకు ప్రజల మద్దతును తెలియజేస్తోంది అంటూ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ ముదురు జంట చాలా గొప్పగా చెప్పుకొచ్చింది. మళ్ళీ పెళ్లి సినిమా కథ.. నరేష్ – పవిత్రా లోకేష్ ప్రేమకథకి సంబంధించిన బయోపిక్.
Also Readd: ట్యూటర్ ను పెట్టుకొని మరీ..
ఈ ఇద్దరూ ఎలా పరిచయం అయ్యారో, వాళ్ల మధ్య బంధం ఎలా బలపడిందో తొలి భాగంలో చూపించారు. పవిత్రా లోకేశ్ గురించి ప్రేక్షకులకు తెలియని కోణాన్ని ఇందులో చూపించారు. పవిత్ర మాజీ భర్తతో ఆమె జీవితం ఎలా సాగిందో, అతని దగ్గర ఏం కరువైందో ద్వితీయార్ధంలో చూపించారు. ఇటు నరేష్ మూడో భార్య రమ్య ఎలాంటి తప్పు చేసిందో కూడా చాలా క్లారిటీగా చూపించారు.
Also Readd: హిడింబ ట్రైలర్ అదిరిపోయింది: సాయి ధరమ్ తేజ్