సిద్దరామయ్యకు కలవరం.. బీజేపీ ప్లాన్ అదే !

22
- Advertisement -

కర్నాటక సి‌ఎం గా సిద్దరామయ్య ఇటీవల పదవి బాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత ఎన్నో చర్చల తదనాంతరం సిద్దరామయ్యను సి‌ఎంగా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే సిద్దరామయ్య ప్రభుత్వం మరో ఏడాదిలో కూలిపోతుందని, ఆయన ప్రభుత్వ భవిష్యత్ 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై ఆధారపడి ఉందని జెడిఎస్ నేత కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను జోస్యం చెప్పడం లేదని జరగబోయే పరిణామాలనే తాను ప్రస్తావించినట్లు కుమారస్వామి చెప్పుకొచ్చారు. .

దీంతో ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. అసలు కుమారస్వామి వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటనే దానిపై విశ్లేషకులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. సిద్దిరామయ్య ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం ఉందనేది కుమారస్వామి అభిప్రాయంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు కూడా ఏదే విషయాన్ని నొక్కి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని, అందుకే 130-150 స్థానాల్లో కాంగ్రెస్ కు గెలుపు ఇవ్వాలని రాహుల్ గాంధీ ప్రచారంలో భాగంగా వ్యాఖ్యానించారు.

Also Read:రాత్రి నిద్రకు ముందు ఇలా చేస్తే..

అయితే ఆశించినట్టుగానే కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయం సాధించింది. మరి ఇంత మెజారిటీ బలం ఉన్న కాంగ్రెస్ ను బీజేపీ కూల్చే అవకాశం ఉందా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఆయా రాష్ట్రాలలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చి బీజేపీ అధికారం చేపట్టిన సంగతి విధితమే. ఆ విధంగా చేస్తే సిద్దరామయ్య సర్కార్ కు బీజేపీ నుంచి ముప్పు పొంచి ఉందనే చెప్పాలి. అందుకే సిద్దరామయ్య సర్కార్ ఒక సమత్సరంలో కూలిపోతుందని కుమారస్వామి వ్యాఖ్యానించినట్లుగా కొందరి అభిప్రాయం. మరి ముందు రోజుల్లో బీజేపీ వ్యూహాలను సిద్దరామయ్య ఎలా ఎదుర్కొంటారు ? అధికారాన్ని ఎలా నిలుపుకుంటారో చూడాలి.

Also Read:హీరోయిన్ ఇంట్లోకి అపరిచితులు

- Advertisement -