RBI:రూ.2వేల నోట్లు వెనక్కి…

34
- Advertisement -

భారత రిజర్వు బ్యాంకు మరోసారి డిమానిటైజెషన్‌కు చేసింది. ఈ మేరకు రూ.2వేల నోట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోనున్నట్లు తెలిపింది. ఇక నుంచి వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ అవకాశం సెప్టెంబర్‌ 30, 2023 వరకు ఉంటుందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది. అలాగే 2023 మే 23 నుంచి బ్యాంకులు రూ.20వేల వరకు డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపింది.

2017 మార్చి నుంచి ఇప్పటివరకు 89శాతం వరకు రూ.2వేల నోట్లు ఉన్నట్టు అంచనావేసింది. 2018 మార్చి నుంచి వినియోగదారుల మేరకు రూ.6.73లక్షల కోట్ల(37.3%)ను సర్కిలేషన్‌లో ఉన్నట్టు తెలిపింది. కాగా 2023 మార్చి31 నాటికి దీని విలువ రూ.3.62లక్షల కోట్లు(10.8%)గా ఉన్నట్టు తెలిపింది.

Also Read: జాతీయ అంతరించిపోతున్న జాతుల దినోత్సవం…

- Advertisement -