ఎట్టకేలకు ఈ సీజన్ ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్ లో ప్రతి టీం కూడా మెరుగైన ప్రదర్శనతో రానిస్తూ.. భారీ స్కోర్లు, భారీ ఛేజింగ్ లు చేస్తూ ఆన్ ప్రిడిక్టబుల్ గా మారాయి. దాంతో ఏ టీం ప్లే ఆఫ్ కు వెళుతుంది. ఏ టీం ఇంటిముఖం పడుతుంది అనేది క్రీడా విశ్లేషకులు సైతం అంచనా వేయలేని పరిస్థితి. ప్రస్తుతం గుజరాత్, చెన్నై, ముంబై జట్లకు ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇక మిగిలిన బెర్త్ ల కోసం కోల్ కతా, రాజస్తాన్, బెంగళూరు, పంజాబ్, లక్నో జట్లు పోటీ పడుతున్నాయి.
ఇంతటి టాఫ్ ఫైట్ నెలకొన్న నేపథ్యంలో ఎప్పటి నుంచో ఐపీఎల్ కప్పును ముద్దాడాలని చూస్తున్న ఆర్సీబీ ప్లే ఆఫ్ కు వెళుతుందా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి..ప్రతి సీజన్ మాదిరిగానే ఈ సీజన్ లో కూడా ” కప్పు నన్ దే ” అంటూ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఆర్సీబీ మంచి ప్రదర్శనతోనే రాణిస్తుంది. ఆర్సీబీకి ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగానే ఉన్నప్పటికి.. ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడక తప్పదు. ఇప్పటివరకు 12 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ ఆరింట్లో విజయాలు సాధించి 12 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది. కోల్ కతా, పంజాబ్, రాజస్తాన్ జట్లు కూడా 12 పాయింట్లతో ఆర్సీబీకి గట్టి పోటీ ఇస్తున్నాయి.
Also Read:బాలయ్య బర్త్ డే..ఫ్యాన్స్కి పండగే!
దాంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే మిగిలిన రెండు మ్యాచ్ లలో తప్పక గెలవాల్సి ఉంటుంది. అయినప్పటికి ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడక తప్పదు. ఆర్సీబీ తరువాతి మ్యాచ్ లను సన్ రైజర్స్ హైదరబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లతో ఆడాల్సి ఉంది. ఈ రెండు జట్లపై కూడా భారీ విజయాలను నమోదు చేస్తే 16 పాయింట్లు దక్కించుకోవడంతో పాటు నెట్ రన్ రేట్ కూడా పెరుగుతుంది. అప్పుడు ఆర్సీబీ ప్లే ఆఫ్ లో అడుగుపెడుతుంది. మరి ప్రతి సీజన్ లో కూడా ఐపీఎల్ హాట్ ఫేవరెట్ గా బరీలోకి దిగే ఆర్సీబీ ఈ సీజన్ లోనైనా కప్పు కొడుతుందేమో చూడాలి.