కౌంటింగ్ నేడే.. ఫలితాలపై ఉత్కంఠ !

39
- Advertisement -

దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన కర్నాటక ఎన్నికల ఫలితాలు నేడే వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా మద్యాహ్నం 3 గంటల లోపే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మొత్తం 224 స్థానాలకు గాను 2,615 మంది అభ్యర్తులు ఎన్నికల బరీలో నిలిచారు. ఈ ఏడాది అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 73.19 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మద్య హోరాహోరీగా సాగిన ఈ పోరులో మూడు పార్టీలు కూడా విజయంపై గట్టిగానే కన్నెశాయి. ఏ పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ? ఒకవేళ హంగ్ ఏర్పడితే ఏం చేయాలి ? ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి ? ఏ పార్టీని దూరం పెట్టాలి ? ఇలాంటి అంశాలపై పార్టీలన్నీ ఇప్పటికే స్పష్టమైన వ్యూహరచనతో ఉన్నాయి..

అయితే గతంతో పోల్చితే ఈసారి ఓటింగ్ శాతం పెరగడంతో ఏదో ఒక పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచన వేస్తున్నారు. అందుకే అటు కాంగ్రెస్ పార్టీ ఈసారి 140 సీట్లు కైవసం చేసుకుంటామని కుండబద్దలు కొడుతోంది. మరోవైపు బీజేపీ కూడా అంటే కాన్ఫిడెంట్ గా 130-140 సీట్లు గెలుచుకుంటామని ఇందులో నో డౌట్ అంటూ కమలనాథులు ధీమాగా ఉన్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం హంగ్ ఏర్పడే చాన్సే ఎక్కువని తేల్చేశాయి. దీంతో తుది ఫలితాలపై అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నా దాని ప్రకారం ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాల్సి వస్తే ఏం చేయాలనే దానిపై కూడా ఆట మొదలుపెట్టాయి పోలిటికల్ పార్టీలు.

Also Read:హ్యాపీ బర్త్‌డే…పళనిస్వామి

ఆ దిశగా బీజేపీ ఒకడుగు ముందే ఉందని చెప్పాలి. ఆపరేషన్ లోటస్ వ్యూహంపై కౌంటింగ్ కు ముందే బీజేపీ గట్టిగా ఫోకస్ చేస్తోంది. గత ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ రాకపోయినప్పటికి కాంగ్రెస్ బీజేపీ కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆపరేషన్ లోటస్ వ్యూహాన్ని అమలు చేసింది బీజేపీ. సేమ్ అదే వ్యూహాన్ని ఇప్పుడు కూడా అమలు చేయాలని చూస్తోంది. మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఎమ్మెల్యేలను చేజారిపోకుండా చూసుకునే పనిలో పడ్డాయి. ఇక నేడు కౌంటింగ్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. ఎప్పటికప్పుడు విభిన్నంగా తీర్పుచ్చే కన్నడిగులు ఈసారి ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

Also Read:కాంగ్రెస్ కు భయం పట్టుకుందా ?

- Advertisement -