అదే సీన్ రిపీట్ ?.. మరి భయమెందుకు ?

40
- Advertisement -

కర్నాటక ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. ప్రస్తుతం అందరి దృష్టి ఈ నెల 13న వచ్చే ఫలితాలపై పడింది. ప్రస్తుతం సర్వేలు, ఎగ్జిట్ పోల్స్, విశ్లేషణలు ఇలా ఎన్నో చర్చకు వస్తున్నప్పటికి ఏవి కూడా తుది ఫలితాలపై స్పష్టతను ఇవ్వలేక పోతున్నాయి. కొన్ని సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తే మరికొన్నేమో బిజెపికి అధికారాన్ని కట్టబెడుతున్నాయి. అయితే ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా హంగ్ వైపే ఎక్కువగా నిలిచాయి. దీంతో ఈసారి కూడా కన్నడనాట సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందా అనే డౌట్ తెరపైకి వస్తోంది. ఒకవేళ హంగ్ ఏర్పడితే.. మళ్ళీ అందరి దృష్టి జేడీఎస్ పై పడుతుంది.

కన్నడనాట జేడీఎస్ 20 నుంచి 30 స్థానాలలో అత్యంత ప్రభావం చూపగలిగే పార్టీ. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు లెక్కకు మించి బలం ఉన్నప్పటికి 224 స్థానాలకు గాను 113 సీట్లు కైవసం చేసుకోలేకపోతే.. జేడీఎస్ వద్ద చేయి చాచాల్సిందే. 2018 ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు, కాంగ్రెస్ 80 సీట్లు కైవసం చేసుకున్నప్పటికి 37 సీట్లు సాధించిన జేడీఎస్ నుంచే కుమార స్వామి సి‌ఎం పదవి చేపట్టారు. ఆ విధంగా ఈ ఎన్నికల్లో కూడా జేడీఎస్ పార్టీ కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో జేడీఎస్ 25 సీట్లకు మించి గెలవదని ఆ పార్టీ నేత మాజీ సి‌ఎం కుమారస్వామే చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Also Read: ప్రజల విజయం : ఆప్

ఒకవేళ కుమారస్వామి అన్నట్లు 25 సీట్ల కంటే తక్కువగా వచ్చే బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీ లలో ఏదో ఒక పార్టీ ప్రభుత్వం స్థాపించదని అవసరమైన 113 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ను దాటే అవకాశం ఉంది. ఆ లెక్కన చూస్తే జేడీఎస్ పార్టీ అవసరం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇదే ప్రస్తుతం జేడీఎస్ ను కలవరపెడుతోందట. ఈ ఎన్నికల్లో ధన బలానికి తట్టుకోలేక పోయామని, మా పార్టీ 25 సీట్లకు మించి గెలవదని కుమారస్వామి బహిరంగంగానే అసహనాన్ని వెళ్ళగక్కారు. అయితే ఎప్పుడు ఊహకందని రీతిలో ఫలితాలను ఇచ్చే కన్నడిగులు ఈసారి కూడా ఎవరు ఊహించని రీతిలో ఫలితాలను ఇచ్చే చాన్సే కనిపిస్తోంది.

Also Read: గుజరాత్ మోడల్ వద్దు తెలంగాణ మోడల్ ముద్దు

- Advertisement -