ఢిల్లీ పాలన వ్యవహారాల నియంత్రణ అధికారాలు ఢిల్లీ ప్రభుత్వంకే చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆప్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అలాగే మంత్రి అతిషి సంజయ్ సింగ్ ఆప్ రాజ్యసభ సభ్యులు కూడా ట్విట్ చేశారు. ఈ మేరకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్టర్ వేదికగా ఢిల్లీ ప్రజలకు న్యాయం చేసినందుకు సుప్రీంకోర్టుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో ఢిల్లీ అభివృద్దిలో వేగం పెరుగుతుందని అన్నారు. ప్రజాస్వామ్యం గెలిచిందని అన్నారు.
అతిషి ఆప్ ముఖ్యనేత మంత్రి సత్యమేవ జయతే! ఇన్నేళ్ల పోరాటం తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం గెలిచింది. ఈ తీర్పు ఢిల్లీ ప్రజల విజయమని అన్నారు. ఇప్పుడు ఢిల్లీ రెట్టింపు వేగంతో మరింత ముందుకు దూసుకుపోతుందని అన్నారు.
Also Read: ఢిల్లీ పాలన స్థానిక ప్రభుత్వానిదే: సుప్రీంకోర్టు
సంజయ్ సింగ్ ఆప్ రాజ్యసభ సభ్యులు 8యేళ్ల ఢిల్లీ ప్రజల కల నేరవేరిందన్నారు. ఢిల్లీ ప్రజల అభివృద్దిని మోదీ వృథా చేశారు. ప్రతిపనికి ఆటంకం కలిగించే దురుద్దేశపూరిత చర్యలు ఈ రోజుతో ముగిశాయన్నారు. అన్ని హక్కులు ఎన్నికైన ప్రభుత్వానికి ఉంటాయని వీటిని లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉండవన్నారు. క్యాబినేట్ నిర్ణయం అంతిమమని అన్నారు.
Also Read: ఎగ్జిట్ పోల్స్ : సంచలనం.. విజయం ఆ పార్టీదే !