ఢిల్లీ పాలన స్థానిక ప్రభుత్వానిదే: సుప్రీం

48
- Advertisement -

ఢిల్లీ పాలన వ్యవహారాలలో లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కు అధికారాలు ఉండవని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొన్నారు. పాలనా వ్యవహారాలపై నియంత్రణ ఎన్నికైన ప్రభుత్వానికి ఉంటుందని దానికి ఎల్జీ కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు.

శాంతి భద్రతలు, పోలీసు, భూమిని మినహాయించి మిగిలిన సేవలపై ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయని ఐదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. ఢిల్లీలో భారత రాజ్యంగంలో ఆర్టికల్ 239AA ప్రకారం ఢిల్లీలో ఫెడరల్ ప్రభుత్వాన్ని సృష్టించిందని తెలిపింది. దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఢిల్లీ ప్రభుత్వంపై ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయని వెలువరించిన తీర్పు ప్రతిని సీజేఐ డీవై చంద్రచూడ్ చదివి వినిపించారు.

Also Read: మూడో సారి కే‌సి‌ఆర్ ను సి‌ఎం చేద్దాం !

2015లో ఢిల్లీ పాలన వ్యవహరాలు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండాలని ఢిల్లీ హైకోర్టును సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ ఆశ్రయించారు. అక్కడ సానూకుల ఫలితం రాకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే 2019 ఫిబ్రవరి 14న ఇద్దరు న్యాయమూర్తులు ఈ వివాదంపై భిన్నాభిప్రాయ తీర్పును వెలువరించారు. పాలనా సర్వీసులపై ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేవని జస్టిస్ అశోక్ భూషణ్ చెప్పారు. అయితే జస్టిస్ ఏకే సిక్రి దాన్ని వ్యతిరేకించారు. ఇదే ఆంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంకు సిఫార్సు చేస్తున్నట్టు గతేడాది మే 6న కోర్టు తెలిపింది. దీనిపై ఇటీవల విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది.

Also Read: ప్రజల విజయం : ఆప్

- Advertisement -