- Advertisement -
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన జవాన్ పబ్బాల అనిల్ కుమార్ మృతిపట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. జమ్ముకశ్మీర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో యవ జవాన్ మృతిచెందడం బాధాకరమన్నారు.
అనిల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిఇ తెలిపిన కేటీఆర్…ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అనిల్ మృతితో గ్రామంలో విషాద చాయలు నెలకొన్నాయి.
Also Read:కార్ల్ మార్క్స్…జయంతి
జమ్ముకశ్మీర్ కిస్త్వార్ జిల్లాలోని మార్వా అటవీ ప్రాంతంలో ముగ్గురు జవాన్లతో ప్రయాణిస్తున్న తేలికపాటి హెలికాప్టర్ ప్రమాదవశాత్తు నదిలో కూలిపోయింది. ఆ ముగ్గురిలో అనిల్ మృతి చెందగా ఇద్దరికి గాయాలైనట్టు తెలిసింది. అనిల్‌కు భార్య సౌజన్య, కొడుకులు ఆయాన్, అరవ్ ఉన్నారు.
Also Read:సంగీత ప్రపంచంలో కిషన్ మహారాజ్ దృవతార..
- Advertisement -