టాక్ : ఆఖిల్ ” ఏజెంట్ ” మూవీ ఎలా ఉందంటే..?

49
- Advertisement -

యువ హీరో అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ” ఏజెంట్ “. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీపై మొదటి నుంచి కూడా ఆడియన్స్ లో ఒకరకమైన బజ్ ఉంది. ఈ మూవీలో అఖిల్ గత చిత్రాలకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తుండడం.. విడుదలైన టీజర్, ట్రైలర్ అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకోవడంతో రిలీజ్ కు ముందే ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో నెలకొన్నాయి. ఇక ఎట్టకేలకు ఈ మూవీ నేడు ( ఏప్రిల్ 28 ) ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ మూవీతో అఖిల్ హిట్ కొట్టడా ? మాస్ ఇమేజ్ వచ్చినట్లేనా ? అనే విషయాలను షార్ట్ అండ్ స్ట్రైట్ సమీక్షా ద్వారా తెలుసుకుందాం

కథ విషయానికొస్తే రా ఏజెంట్ కావాలని చిన్నతనం నుంచి కలలు కనే రామకృష్ణ అలియాస్ రిక్కి ( అఖిల్ ) తన డ్రిమ్ ఎలా నెరవేర్చుకున్నాడు..అనేదే మెయిన్ పాయింట్. అనుకొని పరిణామాల కారణంగా రా ఏజెన్సీ హెడ్ దేవిల్ మహదేవ్ ( మమ్ముటి ) రిక్కి కి ఓ మిషన్ అప్పగిస్తాడు. ఈ మిషన్ పూర్తి చేయడంలో రిక్కి ( అఖిల్ ) ఎదుర్కొన్నా ఇబ్బందులు ఏంటి ? చివరకు వీటన్నిటికి దాటుకొని రిక్కి మిషన్ కంప్లీట్ చేశాడా లేదా అనేది ఏజెంట్ మూవీలోని అసలు కథ.

Also Read: ఈ రోజు చిత్రాల పరిస్థితేంటి?

విశ్లేషణ : స్పై థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటికే చాలా సినిమాలు మనం చూసి ఉండడంతో ఏజెంట్ మూవీ రొటీన్ గా అనిపిస్తుంది. సాధారణంగా స్పై థ్రిల్లర్ లో మతిపోగొట్టే ట్విస్ట్ లు సరికొత్త అనుభూతిని పంచుతాయి. కానీ ఏజెంట్ మూవీలో అలాంటి ఎంగేజింగ్ ట్విస్ట్ లు పెద్దగా లేకపోవడంతో కమాన్ ఆడియన్స్ కూడా మూవీలోని ప్రతి సీన్ గెస్ చేసే విధంగా ఉంటాయి. స్క్రీన్ ప్లే కూడా పరమ రొటీన్ గా ఉండడంతో ఏజెంట్ మూవీని ఇదివరకే చూసేసిన ఫీలింగ్ కలుకుతుంది. మూవీలోని సాంగ్స్ కూడా మైనస్సే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ పర్వాలేదనిపించినప్పటికి మూవీ మొత్తంలో అదే టెంపో మిస్ అయిందనే చెప్పాలి. ఇక మూవీలో ఏదైనా హైలెట్ పాయింట్ ఉందా అంటే అది అఖిల్ క్యారెక్టరైజేషన్ మాత్రమే. ఈ మూవీలో సరికొత్త అఖిల్ ను చూస్తామనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కథ కథనం మ్యూజిక్ ఏజెంట్ మూవీకి బిగ్గెస్ట్ మైనస్.

Also Read: Filmfare Awards 2023:విజేతలు వీరే

- Advertisement -