ఈ నెల 30న నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. ఈ మేరకు సచివాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లు ఘనంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సూర్యోదయం [ఉ. 6 గంటల] తరవాత సచివాలయంలో సుదర్శన యాగం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంట 20 నుంచి 1 గంట 30 నిమిషాల మధ్య యాగం పూర్ణాహుతి కార్యక్రమం జరగనుంది.
తరవాత సమీకృత కొత్త సచివాలయం రిబ్బన్ కటింగ్ ఉండనుంది. ఆ వెంటనే 6 వ అంతస్తులోని తన ఛాంబర్లో కొలువుదీరనున్నారు సీఎం కేసీఆర్. మధ్యాహ్నం 1 గంట 58 నిమిషాల నుంచి 2 గంటల 04 నిమిషాల మధ్యకాలంలో తమతమ ఛాంబర్లలో కొలువుదీరనున్నారు వివిధ శాఖల మంత్రులు.మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు కొత్త సచివాలయం ప్రాంగణంలో గ్యాదరింగ్ ఉండనుంది.
Also Read:గురుకుల..హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి
అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. తర్వాత తమతమ స్థానాల్లో కొలువుదీరనున్నారు అధికార, ప్రభుత్వ యంత్రాంగం. ఏప్రిల్ 30 వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది సమీకృత కొత్త పరిపాలనా సౌధం. ఆనాటి నుంచి అక్కడే పూర్తిస్థాయి విధులు నిర్వర్తించనున్నారు సీఎం, సీఎంఓ అధికార యంత్రాంగం, మంత్రులు, సచివులు, ఇతర అధికారగణం, సెక్షన్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు.
Also Read:బీజేపీకి ఆ పార్టీల భయం !