ఏపీలో సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సిబిఐ తనను అరెస్ట్ చేయకుండా హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం వైఎస్ అవినాష్ రెడ్డి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దాంతో ఈ నెల 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయరాదని హైకోర్టు సీబీఐకి సూచించింది. అయితే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీత రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరుగగా సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డి కి షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్ పై స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ వల్ల సీబీఐ దర్యాప్తుపై ప్రభావం పడుతుందని, కేసు దర్యాప్తు సజావుగా జరగాలంటే ముందస్తు బెయిల్ పై స్టే ఇవ్వక తప్పదని అత్యున్నత ధర్మాసనం తెలిపింది.
Also Read: 2024.. సార్వత్రిక సమరానికి సై…!
సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో వివేకా కేసులో సీబీఐ మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది. దాంతో అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయంగానే కనిపిస్తోంది. కాగా కేసులో ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రధాన నిందితుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి పేరు కూడా సీబీఐ చేర్చడంతో అవినాష్ రెడ్డి అరెస్ట్ కూడా ఖాయమని భావించరంతా అయితే అవినాష్ రెడ్డి విచారణ ఉన్న ప్రతిసారి కోర్టును ఆశ్రయించడంతో అరెస్ట్ కాస్త వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ముందస్తు బెయిల్ పై ఏకంగా స్టే విధించడంతో అవినాష్ రెడ్డి అరెస్ట్ అనివార్యం అయ్యే అవకాశం ఉంది. కాగా వివేకా మర్డర్ మిస్టరీ కేసును ఈ నెల 30 లోగా క్లోజ్ చేయాలని ఆ మధ్య సుప్రీం కోర్టు సీబీఐని అదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఈ గడువు తేదీని తాజాగా సుప్రీం కోర్టు జూన్ 30 వరకు పెంచింది. మరి ఈ కేసులో ఇంకెలాంటి నమ్మలేని నిజాలు బయటకు వస్తాయో చూడాలి.
Also Read: KTR:గిరిజన యువతకు సీఎం కేసీఆర్ భరోసా..