హీరో వెంకటేష్ కథానాయకుడిగా క్లాప్ కొట్టిన ‘సైంధవ్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. హిట్, హిట్ 2 చిత్రాలతో ఆకట్టుకొన్న శైలేష్ కొలను ఈ సినిమాకి దర్శకుడు. ప్రస్తుతం శైలేష్ కొలను తన టేకింగ్ స్పీడ్ ను పెంచారు. గ్యాప్ లేకుండా సినిమాని ఫుల్ స్వింగ్ లో షూట్ చేస్తున్నారు. అలాగే వరుసగా ఈ సినిమాలో నటించే నటీనటులను కూడా రివీల్ చేస్తూ వస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం టాలెంటెడ్ యంగ్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ఈ సినిమాలో నటిస్తోంది అని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మరో యంగ్ బ్యూటీ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.
ఇంతకీ, ఆ యంగ్ బ్యూటీ ఎవరో కూడా కాదు, శైలేష్ మొదటి సినిమా “హిట్”లో కనిపించిన రుహాణి శర్మ. రుహాణి శర్మ ఈ చిత్రంలో డాక్టర్ రేణు పాత్రలో కనిపిస్తుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఈ సినిమాలో వెంకీ పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నాడు. ఈ సినిమా కోసం వెంకీ తన ఫుల్ డేట్స్ ఇచ్చేశాడు. సినిమాలో ఆసక్తికరంగా కనిపించడానికి వెంకటేష్ తన గెటప్ అండ్ సెటప్ ను కూడా మార్చుకున్నాడు.
కాగా కథ ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. అందులో ఓ కథానాయికగా రితిక సింగ్ ఎంచుకొన్నారు. గతంలో గురు సినిమాలో రితిక సింగ్ వెంకీతో కలిసి నటించింది. మిగిలిన ఇద్దరి హీరోయిన్స్ పాత్రల్లో రుహాణి శర్మ, శ్రద్ధా శ్రీనాథ్ కనిపించబోతున్నారు. ముగ్గురు హీరోయిన్లూ కథలో భాగంగానే వస్తారు. అంతే తప్ప.. వెంకీతో డాన్సులు, రొమాన్సులూ ఏమీ చేయరు. ఈ చిత్రానికి అయితే సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
An incredibly skilled performer who mesmerises with her presence ❤️
Introducing @iRuhaniSharma as
Dr Renu from #SAINDHAV 💥#SaindhavOnDec22Victory @VenkyMama @Nawazuddin_S @KolanuSailesh @ShraddhaSrinath @vboyanapalli @Music_Santhosh @tkishore555 @NiharikaEnt #Venky75 pic.twitter.com/7Jpxts37Oa
— Niharika Entertainment (@NiharikaEnt) April 21, 2023